కాబోయే వధువు కోసం ఆ స్పెషల్ పార్టీ.. ఇలా! - tips to host a memorable bachelorette party for your friend in telugu
close
Published : 01/09/2021 19:23 IST

కాబోయే వధువు కోసం ఆ స్పెషల్ పార్టీ.. ఇలా!

పెళ్లంటే వేడుకలే కాదు.. వివిధ రకాల పార్టీలూ ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. ‘బ్యాచులరెట్ పార్టీ’ కూడా అలాంటిదే! సింగిల్‌హుడ్‌కి సెండాఫ్‌ చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోన్న తమ నెచ్చెలికి స్నేహితురాళ్లంతా కలిసి ఇచ్చే స్పెషల్‌ పార్టీ ఇది! ఎంతో సరదా, ఎన్నో భావోద్వేగాలు మిళితమై ఉన్న ఈ ప్రి-వెడ్డింగ్‌ పార్టీని జరుపుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు! ఏదేమైనా ఈ ప్రత్యేక సందర్భం ఇటు మీలో, అటు నవ వధువులో కొత్త జోష్‌ నింపాలంటే, కొత్త పెళ్లి కూతురు ఎన్నో మధురానుభూతులు మూటగట్టుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.

సర్‌ప్రైజ్‌ మీద సర్‌ప్రైజ్!

మీరిచ్చే పార్టీ ఎప్పుడు, ఎక్కడ అనే విషయాలు మీ నెచ్చెలికి ఎలాగూ ముందే చెప్పి పెడతారు. అలాగని ప్రతిదీ చెప్తామంటే అందులో సర్‌ప్రైజ్‌ ఏముంటుంది చెప్పండి! అందుకే కాబోయే వధువుకు కొన్ని విషయాలు అప్పటికప్పుడు రివీల్‌ చేస్తూ ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తమంటున్నారు నిపుణులు. సాధారణంగానైతే ఈ పార్టీలో గర్ల్‌ గ్యాంగ్‌కే చోటుంటుంది.. కానీ మీరు ఓ అడుగు ముందుకేసి.. వరుడిని ఈ పార్టీకి ఆహ్వానించి మీ స్నేహితురాలిని సర్‌ప్రైజ్‌ చేయచ్చు. మీరంతా ఒకే తరహా డ్రస్సింగ్‌లో ముస్తాబై.. మీ స్నేహితురాలి అభిరుచుల మేరకు ఓ లవ్లీ డ్రస్‌ డిజైన్‌ చేయించి.. పార్టీలో ఆమెను అందంగా ముస్తాబు చేయండి.. తన మనసు నిండిపోతుంది. ఇలా ఈ క్రమంలో మీరు ‘బ్యాచులరెట్ పార్టీ’/ ‘బ్రైడ్‌ స్క్వేర్‌’/ ‘బ్రైడ్స్‌మెయిడ్‌’, ‘టీమ్‌ బ్రైడ్‌’.. వంటి పదాలున్న కస్టమైజ్డ్‌ దుస్తుల్ని ఎంచుకోవచ్చు.. లేదంటే మీరే ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకోవచ్చు. ఇక మీ నెచ్చెలికి నచ్చిన బహుమతులూ ఆమెకు అందించి సర్‌ప్రైజ్‌ చేయచ్చు.

థీమ్‌కు అనుగుణంగా!

కాబోయే వధువుకు బ్యాచులరెట్ పార్టీ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలంటే మీరు ఎంచుకునే వేదిక, దాని అలంకరణా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. అయితే ఇది పూర్తిగా మీ నెచ్చెలి అభిరుచులకు తగినట్లుగా ఉంటే తన ఆనందానికి అవధులుండవు. ఈ క్రమంలో కొందరికి ఇంట్లోని తమ ప్రైవేట్ ప్లేస్‌లో చేసుకోవడం ఇష్టముండచ్చు.. ఇంకొందరు హోటల్స్‌, బీచ్‌.. వంటి ప్రదేశాల్ని ఎంచుకోవచ్చు.. మరికొందరు విదేశంలో ప్లాన్‌ చేసుకోవచ్చు.. ఇలా ఎక్కడ చేసుకున్నా ఓ చక్కటి థీమ్‌ను ఎంచుకుంటే మీ ప్రత్యేకతను చాటుకోవచ్చు. ఈ క్రమంలో డిస్నీ థీమ్‌, బీచ్‌ థీమ్‌, పర్యావరణాన్ని ఇష్టపడే వారు ఎకో-ఫ్రెండ్లీ థీమ్, కలర్‌ కోడింగ్‌ థీమ్‌.. ఇలా మీ స్నేహితురాలి అభిరుచులు, మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఓ అంశాన్ని ఎంచుకొని.. దాని ప్రకారమే వేదికను అలంకరించాలి. అలాగే మీరు, కాబోయే వధువు వేసుకునే అవుట్‌ఫిట్స్‌ కూడా అలంకరణను బట్టే ఉండాలి. అంటే థీమ్‌ కాస్త మోడ్రన్‌గా ఉంటే ట్రెండీ అవుట్‌ఫిట్స్‌, కాస్త హోమ్లీగా ఉంటే సంప్రదాయ దుస్తులు.. వంటివి ధరించేలా ప్లాన్‌ చేసుకోవచ్చు. ఇక ‘బ్రైడ్‌ టు బి’, ‘వధూవరుల పేర్లతో క్రియేట్‌ చేసిన హ్యాష్‌ట్యాగ్‌’.. వంటి వాటితో ప్రత్యేకమైన పేపర్‌/బెలూన్‌ బ్యాన్సర్‌ ఏర్పాటు చేయడం, థీమ్‌కు అనుగుణంగా బ్రైడల్‌ కేక్‌ను ప్రత్యేకంగా తయారుచేయించడం.. ఇవన్నీ ఇందులో భాగమే!

‘ఫొటోషూట్‌’తో వైరల్!

సాధారణంగా ఏ అకేషనైనా ఫొటోషూట్‌ చేయించుకోవడం ఇప్పటి ట్రెండ్! ఇది బ్యాచులరెట్ పార్టీకీ వర్తిస్తుంది. కాబట్టి ఈ పార్టీలోని జోష్‌ను సెల్ఫీలు, మీ మొబైల్స్‌లో బంధించడంతో పాటు ఈ మెమరీస్‌ని మరింత న్యాచురల్‌గా క్లిక్‌మనిపించడానికి ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ సహాయం తీసుకోవాల్సిందే! ఈ క్రమంలో క్యాండిడ్‌ ఫొటోషూట్‌కి ప్రాధాన్యమిస్తే ఫొటోలన్నీ రియాల్టీకి తగినట్లుగా వస్తాయి. మరి, మీ పార్టీ హంగామా అందరికీ తెలియాలంటే.. ఈ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఎక్కువగా ఫాలోయింగ్‌ ఉన్న ఫ్రెండ్స్‌ అకౌంట్స్‌ని వీటికి ట్యాగ్‌ చేస్తే సరి.. లక్షల కొద్దీ లైకులు, షేర్లతో మీ ఫొటోలు కొత్త ట్రెండ్‌ని సెట్‌ చేస్తాయి.

నా గురించి నీకెంత తెలుసు?

బ్యాచులరెట్ పార్టీ అంటే ముస్తాబవడం, ఫొటోలు దిగడమే కాదు.. సరదా ఆటలు కూడా ఇందులో భాగమైతేనే పార్టీ మజాను పూర్తిగా ఆస్వాదించచ్చు. ఈ క్రమంలో మీ క్రియేటివిటీని బట్టి ఫన్నీ గేమ్స్‌ ప్లాన్‌ చేయచ్చు. మీ నెచ్చెలి వధువుగా ప్రమోషన్‌ పొందబోతోంది కాబట్టి.. ఆమెనే థీమ్‌గా తీసుకొని గేమ్‌ ప్లాన్‌ చేయచ్చు. అదెలాగంటే.. ‘నా గురించి నీకెంత తెలుసు?’ అనే అంశాన్ని తీసుకొని.. కాబోయే వధువు గురించి మీకు తెలిసిన విషయాలు, ఆమెలో మీకు నచ్చిన అంశాలు.. ఒక్కొక్కరుగా చెప్పచ్చు. లేదంటే మీ గర్ల్‌ గ్యాంగ్‌లో వరుడికి చోటిచ్చి.. కాబోయే దంపతులిద్దరితో ఓ ఫన్నీ గేమ్‌ ఆడించచ్చు. ఒకరి ఇష్టాయిష్టాలపై మరొకరికి ప్రశ్నలు సంధిస్తూ సమాధానం రాయమనచ్చు. ఇవన్నీ ఇటు మీకు, అటు వారికి బోలెడంత సరదాను పంచుతాయి.

‘వర్చువల్‌’గా ఇలా!

ఇక ఈ కరోనా సమయంలో రిస్క్‌ ఎందుకని ఏ పార్టీ అయినా వర్చువల్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు మరికొందరు. మీ ఫ్రెండ్‌ కోసం ఏర్పాటు చేసే బ్యాచులరెట్ పార్టీ కూడా వర్చువల్‌గానే నిర్వహించాలనుకుంటున్నారా? అయితే అందుకోసం కాస్త ముందు నుంచే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. స్నేహితురాళ్లంతా కలిసి థీమ్‌ను ఎంచుకోవడం.. దానికి అనుగుణంగా మీ నెచ్చెలికి అందించబోయే కానుకల్ని సమయానికి ఆమెకు చేరేలా చూడడం.. వర్చువల్‌ గేమ్స్‌, వర్చువల్‌ డిన్నర్‌.. ఇలా ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం జూమ్‌, గూగుల్‌ మీట్‌.. వంటి సాంకేతిక వేదికలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇలా మీరంతా భౌతికంగా దూరంగా ఉన్నా.. కలిసే పార్టీ సెలబ్రేట్‌ చేసుకున్న భావన కలుగుతుంది.

ఇలా మీ నెచ్చెలికి మీరిచ్చే పార్టీ ఆమెకు జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇది మీ స్నేహబంధాన్నీ పెంచుతుంది.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని