వర్షాకాలంలో వుడెన్ ఫర్నిచర్ సంరక్షణ ఇలా..! - tips to keep your wooden furniture safe during monsoon
close
Published : 28/06/2021 14:07 IST

వర్షాకాలంలో వుడెన్ ఫర్నిచర్ సంరక్షణ ఇలా..!

ఇంటి అలంకరణలో భాగంగా చెక్కతో తయారుచేసిన గృహోపకరణాలను కూడా ఈమధ్య విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే వాటి మన్నిక, నాణ్యత దెబ్బతినకుండా ఉండాలంటే కాలానుగుణంగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు ఇంటీరియర్ నిపుణులు. అప్పుడే అవి ఎప్పుడూ కొత్తవాటిలా మిలమిలా మెరుస్తూ ఉంటాయట! మరి, ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వుడెన్ ఫర్నిచర్ సంరక్షణలో భాగంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనమూ తెలుసుకుందాం రండి..!

వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికశాతంలో ఉంటుంది. ఇది చెక్కతో తయారైన ఉపకరణాలు త్వరగా పాడైపోయేలా చేస్తుంది. కాబట్టి తేమ నుంచి వాటికి తగిన రక్షణ కల్పించడం తప్పనిసరి. ఈ క్రమంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు..

గోడకు ఆనించద్దు..!

సోఫా, దివాన్.. వంటి కొన్ని ఫర్నిచర్లను చాలామంది గోడకి ఆనించి వేస్తారు. ఇంట్లో కాస్త ఖాళీ స్థలం కనిపించేలా చేయడం కోసం ఈ చిట్కాని అనుసరించినా వర్షాకాలంలో మాత్రం ఇది మంచిది కాదు. వర్షానికి తడిసే గోడల్లో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. చెక్కతో తయారైన వస్తువులు గోడలకు ఆనించి ఉండడం వల్ల ఈ తేమ వాటిలో కూడా చేరి వాటి నాణ్యత, మన్నికని దెబ్బ తీసి త్వరగా పాడైపోయేలా చేయచ్చు. కాబట్టి ఈ కాలంలో మాత్రం వుడెన్ ఫర్నిచర్‌ని గోడలకు కనీసం ఆరు అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి.

నేరుగా జల్లులు పడకుండా..

చల్లని గాలి కోసం సౌకర్యవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో కిటికీలు, తలుపులకు దగ్గరలో కూడా చెక్కతో చేసిన కుర్చీలు, సోఫాలు.. వంటివి పెడుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఈ కాలంలో కురిసే వర్షపు చినుకులు నేరుగా వాటి మీద పడే అవకాశాలుంటాయి. ఫలితంగా అవి తడిసిపోయి త్వరగా పాడైపోతాయి. అలాగే వాటిలో తేమ శాతం మరీ ఎక్కువైనప్పుడు చూసుకోకపోతే బూజు లేదా నాచు.. వంటివి పడుతూ ఉంటాయి. ఫలితంగా రకరకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు అవి నిలయాలుగా మారచ్చు. కాబట్టి నేరుగా జల్లులు పడే ప్రదేశాల్లో కూడా వీటిని అమర్చకూడదు.

 

తేమ నిలవకుండా..

నేరుగా కురిసే చినుకుల ద్వారానే కాకుండా గాల్లో ఉండే తేమ వల్ల కూడా చెక్కతో తయారైన ఉపకరణాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు వుడెన్ ఫర్నిచర్‌కు ఉపయోగించిన పాలిష్‌కి అనుగుణంగా లక్క లేదా వార్నిష్ కోట్ వేయించాలి. ఫలితంగా వాటిలో తేమ చేరకుండా ఎక్కువ కాలం నాణ్యతతో మన్నుతాయి. కనీసం రెండు సంవత్సరాలకోసారి ఇలా చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉందండోయ్.. కాలక్రమేణా చెక్క మధ్యలో ఏర్పడే రంధ్రాలు కూడా ఎప్పటికప్పుడు కవర్ అయిపోయి నాణ్యత చెక్కుచెదరకుండా ఉంటాయి. అలాగే తరచూ వేసే వార్నిష్ లేదా లక్క కోటింగ్‌ల కారణంగా అవి కొత్తవిలా మెరుస్తాయి.

ఎప్పటికప్పుడు శుభ్రంగా..

వర్షాకాలంలో చెక్కతో తయారైన వస్తువులను కనీసం నెలకి ఒకసారైనా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మెత్తని పొడివస్త్రంతో వాటిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించాలి. అయితే వుడెన్ ఫర్నిచర్‌ని తుడవడానికి తడి వస్త్రాన్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ తడి ద్వారా తేమ చెక్క వస్తువుల్లో చేరే అవకాశాలుంటాయి. కాబట్టి పొడివస్త్రంతోనే ఫర్నిచర్ మూలలు, కింద, వెనుకభాగంలో కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి.

పొడిగా ఉండేందుకు..

వుడెన్ ఫర్నిచర్‌లో తేమ చేరకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో; వాటిని పొడిగా ఉండేలా జాగ్రత్తపడడం కూడా అంతే అవసరం. ఈ క్రమంలో నాఫ్తలీన్ బాల్స్ లేదా కర్పూరం వంటివి వాటి మధ్య ఉంచడం వల్ల గాల్లో అధికంగా ఉన్న తేమని అవి గ్రహిస్తాయి. ఫలితంగా ఫర్నిచర్ పాడవకుండా ఉంటుంది. వీటికి బదులుగా ఇంట్లో లభ్యమయ్యే లవంగాలు, వేపాకులు.. వంటివి కూడా ఉపయోగించవచ్చు. ఇవి ఫర్నిచర్‌లో చెదలు, పురుగులు.. మొదలైనవి చేరకుండా కూడా సంరక్షిస్తాయి.
కొత్త వుడెన్ ఫర్నిచర్ కొనేందుకు లేదా ఉన్నవి బాగుచేసుకునేందుకు వర్షాకాలం అనువైన సమయం కాదు. కాబట్టి ఈ కాలంలో ఉన్నవాటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటూ, సంరక్షించుకోవడమే ఉత్తమం.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని