ఇలా వండుకుంటే పోషకాలు తరిగిపోవు! - tips to retain nutrients while cooking in telugu
close
Published : 25/08/2021 20:26 IST

ఇలా వండుకుంటే పోషకాలు తరిగిపోవు!

మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. చక్కటి పోషకాహారం తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎలాంటి వైరస్‌, బ్యాక్టీరియాకు మన శరీరం లొంగకుండా జాగ్రత్తపడచ్చు. అయితే ఇదంతా ఆహార పదార్థాల్లోని పోషకాలను శరీరం గ్రహించినప్పుడే సాధ్యపడుతుంది. అది జరగాలంటే మనం ఆహారం వండుకునే విధానంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. లేదంటే వాటిలో ఉన్న పోషకాలు నశించిపోయే అవకాశం ఉందంటున్నారు. మరి, ఆయా పదార్థాల్లోని పోషకాలు తగ్గిపోకుండా వండుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి..

డీప్‌ ఫ్రై, ఆవిరిపై ఉడికించుకోవడం, ఒవెన్‌లో వండుకోవడం, గ్రిల్‌ చేసుకోవడం, వేయించుకోవడం.. ఇలా ఆహారం వండుకోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో పద్ధతి. నిజానికి గుడ్లు, మాంసాహారం.. వంటి కొన్ని ఆహార పదార్థాలు పచ్చిగా తీసుకోవడం కంటే వండుకొని తింటేనే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.. అలాగే సులభంగా జీర్ణమవుతాయి కూడా! అదే కాయగూరలు ఉడికించడం, డీప్‌ ఫ్రై చేయడం వల్ల వాటిలోని కొన్ని పోషకాలు తొలగిపోయే అవకాశం ఉంది.. అలాగని వాటిని పచ్చిగా తినలేం.. కాబట్టి వండుకునేటప్పుడే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే వాటిలోని పోషకాలు నశించిపోకుండా జాగ్రత్తపడచ్చు. అవేంటంటే..!

పోషకాలు పోకుండా..!

* దుంప జాతికి చెందిన కాయగూరల్ని వండుకునే ముందు తొక్క చెక్కేయడం మనందరం చేసేదే! అయితే కొంతమంది వాటి తొక్కను లోపలి నుంచి చెక్కేస్తుంటారు. దానివల్ల ఆ తొక్క కిందే ఉండే విటమిన్‌-బి, విటమిన్‌-సి, ఫోలికామ్లం.. వంటి పోషకాలు ఉడికించే క్రమంలో నశించిపోతాయి. అందుకే అత్యవసరమైతేనే తొక్క చెక్కేయమంటున్నారు నిపుణులు. అది కూడా పైపైన తొలగించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే బంగాళాదుంప, చిలగడదుంప వంటి వాటిని తొక్కతోనే నీటిలో ఉడికించి.. ఆపై తొక్క తీసేస్తే సరిపోతుంది.

* కొన్ని కాయగూరలు కట్‌ చేశాక రంగు మారుతుంటాయి. అలా జరగకూడదని వాటిని నీటిలో వేసేస్తుంటారు. దానివల్ల రంగు మారకపోవడం అటుంచితే.. వాటిలో ఉండే నీటిలో కరిగే పోషకాలు నశించిపోయే అవకాశమే ఎక్కువట! ఒకవేళ కచ్చితంగా నీటిలో వేయాలనుకుంటే మాత్రం ఆ నీటిని వృథాగా పడేయకుండా పిండి కలుపుకోవడానికి, సూప్స్‌, గ్రేవీలు తయారుచేసుకోవడానికి వినియోగించమని సలహా ఇస్తున్నారు నిపుణులు.

* అలాగే కాయగూరల్ని ఉడికించిన నీరు, అన్నం వండుకున్న తర్వాత వార్చే గంజిలో బోలెడన్ని పోషకాలుంటాయి. కాబట్టి వాటిని పడేయకుండా సూప్స్‌, గ్రేవీల తయారీలో ఉపయోగించచ్చు.. లేదంటే అదే నీటిలో కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసుకొని గోరువెచ్చగా తాగితే అటు రుచికి రుచి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం!

* కొంతమంది త్వరగా ఉడకాలని కాయగూరల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేస్తుంటారు. ఫలితంగా వాటిలోని పోషకాలు వాతావరణంలోని ఆక్సిజన్‌తో కలవడం వల్ల అవి నశించిపోయే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు. అందుకే ఉడకానికి కాస్త ఎక్కువ సమయం పట్టినా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవడం మంచిదంటున్నారు.

* కొంతమంది సమయం లేక ఒక రోజు ముందు లేదంటే సాయంత్రం కోసం ఉదయమే సలాడ్స్ తయారుచేసుకొని పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల వాతావరణంలోని ఆక్సిజన్‌తో ఆ కాయగూరల్లోని పోషకాలు చర్య జరిపి నశించిపోయే అవకాశం ఉంది. అందుకే తినే ముందే సలాడ్స్‌ని తయారుచేసుకోవడం, మూత ఉన్న గిన్నెల్లోనే వాటిని సర్వ్‌ చేసుకోవడం మంచిదంటున్నారు.

* వండిన ఆహార పదార్థాలను పదే పదే వేడి చేస్తుంటారు కొంతమంది. అలా చేసిన ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో పోషకాలు నశించిపోతాయట! అంతేకాదు.. వాటిని వండే క్రమంలోనూ కొన్ని నీళ్లు పోసి.. మూత పెట్టి వండుకుంటే పోషకాలు ఆవిరి రూపంలో ఇగిరిపోకుండా జాగ్రత్తపడచ్చు.

* వండుకునే క్రమంలో బేకింగ్‌ సోడా వేయడం వల్ల ఆ కాయగూరలు ఉడికించే నీళ్లు ఆల్కలీన్‌గా మారే అవకాశం ఉంది. తద్వారా కాయగూరలు త్వరగా ఉడకడం అటుంచితే.. వాటిలోని థయామిన్‌, విటమిన్‌ ‘సి’ వంటి నీటిలో కరిగే పోషకాలు త్వరగా నశించిపోతాయి.

* పాలల్లో థయామిన్‌, రైబోఫ్లేవిన్‌, విటమిన్‌ బి12 పుష్కలంగా ఉంటాయి. అయితే పాలను మూత ఉన్న గిన్నెలో కాకుండా ఓపెన్‌గా ఉంచితే ఇందులోని రైబోఫ్లేవిన్‌ నశించిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అలా జరగకుండా ఉండాలంటే పాల గిన్నెపై మూతపెట్టడం తప్పనిసరి అంటున్నారు.

* 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ సమయం ఉడికించినా లేదంటే డీప్‌ ఫ్రై చేసినా.. ఆయా పదార్థాల్లో ఉండే ప్రొటీన్లు గడ్డ కట్టుకుపోతాయి. వాటిని శరీరం అంత సులభంగా గ్రహించలేదు. కాబట్టి డీప్‌ ఫ్రై చేయడం, ఎక్కువ సేపు వేడి పైనే ఉంచడం మానుకోవడం మంచిది.

* మైక్రోవేవ్‌ ఒవెన్‌లో ఆహారం వండుకోవడం సులభం. అంతేకాదు.. ఈ క్రమంలో ఉడకడానికి తక్కువ సమయం పట్టడం, కాయగూరలు నేరుగా వేడికి ఎక్స్‌పోజ్‌ అవకపోవడం వల్ల పోషకాలు నశించే అవకాశం తక్కువ. అందుకే ఈ పద్ధతే మంచిదని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది.

* కోడిగుడ్లు, మాంసాహారం పచ్చిగా కంటే ఉడికించుకొని తినడం వల్లే వాటిలోని ప్రొటీన్లు సులభంగా జీర్ణమవుతాయట! తద్వారా శరీరానికి కూడా ఎక్కువ పోషకాలు అందుతాయి.


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని