మెడను మెరిపించాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే.. - tips to take care of your neck skin
close
Published : 15/07/2021 17:49 IST

మెడను మెరిపించాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే..

ముఖం అందంగా తయారవడం కోసం ఎన్నో రకాల క్రీములు, ప్యాక్‌లు వాడతాం. కానీ మెడ భాగానికొచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇరవైల్లో పెద్దగా తేడా తెలియకపోయినా.. వయసు పెరిగే కొద్దీ ఆ ప్రభావం మెడ మీద బాగా కనిపిస్తుంది. మెడ చుట్టూ నల్లటి వలయం, సన్నటి ముడతలు, చిన్న చిన్న పొక్కులతో క్రమంగా చర్మం కాంతి విహీనంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మెడ సౌందర్యాన్ని తిరిగి పెంపొందించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా మరి..!

ఇలా శుభ్రపరుచుకోవాలి..

ముఖంపై ఉండే చర్మం కన్నా మెడ చర్మం చాలా పల్చగా, సున్నితంగా ఉంటుంది. అందుకని ఎక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడకూడదు. వీలైనంత వరకు రసాయనాలు లేని సబ్బు/ బాడీ వాష్‌లను వాడాలి. అంతేకాదు.. ముఖాన్ని శుభ్రం చేసుకునే ప్రతిసారీ మెడను కూడా శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

స్క్రబ్ వాడాలి

చెమట వల్ల మెడపై చాలా త్వరగా మురికి చేరుతుంది. అంతేకాదు నిత్యం మనం ధరించే చెయిన్ల వల్ల కూడా మెడపైన మురికి పేరుకునే అవకాశం ఉంది. సబ్బుతో పైపై మురికి పోయినా, చర్మ రంధ్రాల్లో పేరుకున్న మలినాలు పోవాలంటే స్క్రబ్బర్ తప్పనిసరి. ఇలా జరగ కుండా ఉండాలంటే మనం వేసుకునే చెయిన్లను శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి నాలుగుసార్లు స్క్రబ్బర్ వాడాలి.

*బాదం పలుకులని బరకగా పొడి చేసి, కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌లా చేసి మెడకు పట్టించాలి. భుజాల నుంచి ముఖం వైపుగా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసి, చల్లటి నీటితో కడిగేయాలి. ఐదు నిమిషాలకు మించి స్క్రబ్ చేయకూడదు. ఎందుకంటే అతిగా స్క్రబ్ చేయడం వల్ల పల్చని మెడ చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.

నెక్ ప్యాక్

ఫేస్ ప్యాక్ వాడుతున్న ప్రతిసారీ మెడకి కూడా ప్యాక్ వేసుకోవడం తప్పనిసరి. బాగా పండిన అరటి పండు, లేదా గుమ్మడి పండు, బొప్పాయి గుజ్జుతో ప్యాక్ వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఫ్రూట్ ప్యాక్‌లను వాడటం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

* పాలమీగడలో పావు చెంచా నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి మెడకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే మెడచుట్టూ పేరుకున్న నలుపు క్రమంగా తగ్గుతుంది.

టోనింగ్

ముఖంపై చర్మానికి టోనర్ వాడేప్పుడు మెడకు కూడా టోనర్ అప్త్లె చేయడం అలవాటు చేసుకోవాలి. కానీ మెడకి టోనర్ రాసుకునేప్పుడు నేరుగా చేతి వేళ్లతో కాకుండా దూదిని వాడాలి.

మాయిశ్చరైజర్

చర్మ సంరక్షణలో మాయిశ్చరైజర్ చాలా ముఖ్యమైనది. క్రమం తప్పకుండా మెడకు మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మం పొడిబారి పొలుసులుగా మారకుండా ఉంటుంది. పల్చగా ఉండడం వల్ల మెడ చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కొలాజెన్ క్రీములు, మాయిశ్చరైజర్లు వాడాలి.

నెక్ మసాజ్

ఆలివ్ లేదా కొబ్బరినూనెలో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కలిపి 15 నుంచి 20 నిమిషాల పాటు భుజాల నుంచి ముఖం వైపుకి మసాజ్ చేయాలి. (20 నిమిషాలకు మించి నెక్ మసాజ్ చేయకూడదు.) వారానికొకసారి నెక్ మసాజ్ చేయడం వల్ల నలుపుదనం, ముడతలు తగ్గి చర్మం మెరుపు సంతరించుకుంటుంది.

ఐస్ వాష్

తరచూ ఐస్‌క్యూబ్స్‌తో మసాజ్ చేయడం లేదా చల్లటి నీటితో కడగడంవల్ల, వదులైన చర్మరంధ్రాలు తిరిగి బిగుతుగా తయారవుతాయి.

మెడ నల్లగా మారడానికి వూబకాయం, హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం కూడా ప్రధాన కారణాలు. సరైన వ్యాయామం చేస్తూ, మంచి ఆహారం తీసుకుంటూనే, ఈ జాగ్రత్తలు పాటిస్తే మెడ సౌందర్యం రెట్టింపవుతుంది.

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని