దోమల బెడదను తగ్గించే ఈ చిట్కాలు మీ కోసమే.. ! - try these ayurvedic steps to fight against mosquitoes in telugu
close
Updated : 16/06/2021 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దోమల బెడదను తగ్గించే ఈ చిట్కాలు మీ కోసమే.. !

ఈ కాలంలో డైనోసార్లు ఉంటే వాటి నుంచైనా తప్పించుకోవచ్చేమో కానీ దోమ కాటు నుంచి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం నిత్యం ఎవరికైనా రక్త దానం చేస్తామంటే అది ఒక్క దోమలకే! ఈ చిన్న ప్రాణి కాలానికో కొత్త రోగాన్ని ప్రవేశపెడుతోంది. లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్లు వంటివి దోమల్ని చంపడం అటుంచితే తిరిగి మన ఆరోగ్యంపైనే ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అందుకే మనిషికి హాని కలగకుండా దోమల్ని, అవి సృష్టించే రోగాల్ని ఆయుర్వేద చిట్కాల ద్వారా దూరం చేయొచ్చంటున్నారు నిపుణులు. మరి అవేంటో ఒకసారి చూద్దాం రండి !

సిగరెట్ కంటే ప్రమాదం.. వాటిని వదిలేయండి !
మనం నిత్యం వెలిగించే మస్కిటో కాయిల్స్ ఒక్కటి వెలిగించినా చాలు దాని వల్ల 70 నుండి 120 సిగరెట్లు కాల్చితే వచ్చే పొగ పీల్చినట్లే ! శాస్త్రీయంగా దీనిని నిరూపించకపోయినా కొంతమంది మాత్రం ఇందులో నిజం లేకపోలేదంటున్నారు. అందుకే అది నిజమో, అబద్ధమో తర్కించే బదులు చక్కగా ఇలా సహజ సిద్ధమైన చిట్కాల్ని ఫాలో అయిపోమంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

* నిత్యం మస్కిటో కాయిల్స్ వెలిగించే బదులు కిటికీలు, తలుపులు మూసి కాస్త కర్పూరం, వేప ఆకులు కలిపి పదిహేను నిమిషాల పాటు పొగ వేస్తే.. ఇక దోమలు మళ్లీ ఇంట్లోకి రావంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఒకవేళ వేప ఆకులు లేనట్త్లెతే కర్పూరంతో పొగ వేసినా పర్లేదంటున్నారు.
* ఆవాల పొడి, వేప ఆకుల పొడి, సముద్రపు ఉప్పు మూడూ తగిన మోతాదులో కలుపుకోవాలి. తర్వాత నాలుగు బొగ్గులని వేడి చేసుకొని ఒక మట్టిపాత్రలో వేసుకోవాలి. ఇంటి డోర్లన్నీ మూసి పొడిని కొంచెం కొంచెంగా బొగ్గులపై చల్లుకుంటూ ఇల్లంతా పట్టాలి. పై వాటిలానే దోమల్ని తరిమేయడానికి ఇదో చక్కని ఉపాయం అంటున్నారు.

* ఇప్పుడు బొగ్గులెక్కడి నుండి వస్తాయనుకునే వారు అరోమాల్యాంప్స్‌లో కర్పూరం, సాంబ్రాణి, వేప నూనె, జామాయిల్ నూనె (యూకలిప్టస్ ఆయిల్), లెమన్ గ్రాస్ నూనె, తేయాకు నూనె, లావెండర్ నూనె వీటిలో ఏదైనా ఒక్కటి వేసి పెట్టుకుంటే సువాసనకి సువాసనతో పాటు దోమల బెడద కూడా ఉండదు.
* నాలుగు వెల్లుల్ల్లిపాయలను దంచి, ఏదైనా కొంచెం నూనె లేక నెయ్యితో పాటు కాస్తంత కర్పూరం కలుపుకొని వెలిగించుకుంటే ఆ పొగకు దోమలు చనిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. లిక్విడ్ రీఫిల్స్, మస్కిటో మ్యాట్స్ కంటే ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని అంటున్నారు.

* వేప నూనెకి అంతే మోతాదులో కొబ్బరి నూనె కలిపి శరీరానికి రాసుకొని పడుకుంటే ఎనిమిది గంటల వరకూ దోమలు కుట్టకుండా కాపాడుకోవచ్చు.

ఇంటి చుట్టూ నీరు ఉంచకండి!
* వర్షాకాలంలో నిలువున్న నీరే ప్రమాదకరం అని మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. దోమలకి ఆ నీరే నివాసం కనుక తప్పకుండా ఇంట్లో, ఇంటి సమీపంలో నీటి నిలువ ఉండకుండా జాగ్రత్త పడాలి.
* ఒకవేళ నిలువ ఉన్న నీరు తీయడానికి సమయం పడుతుందనుకుంటే తులసి రసాన్ని కానీ నూనెని కానీ ఆ నీటిపై, దోమలున్న ప్రాంతంలో చల్లాలి. తులసి రసానికి డింభక నాశని అని పేరు. ఇది దోమల లార్వాని నాశనం చేస్తుంది.

ఈ మొక్కలను తప్పక పెంచండి !
ఇంటి చుట్టూ తులసి, వేప, జామాయిల్/యూకలిప్టస్ వంటి చెట్లు ఉంటే దోమల శాతం తగ్గుతుంది. ఒక కుండీలో అలొవెరా పెంచుకుంటే దోమ కాటుకి బాగా పని చేస్తుంది. కొన్ని దోమలు కుడితే బాగా మంటపుట్టడం, పెద్ద పెద్ద దద్దుర్లు రావడం సహజం. ఆ సమయంలో చిన్న అలొవెరా ముక్కను కట్ చేసి ఆ ప్రాంతంలో రాస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు తులసి ఆకులని కానీ వేప ఆకులని కానీ పేస్ట్‌గా చేసి దోమ కుట్టిన చోట రాసుకుంటే ప్రభావవంతంగా ఉంటుంది.

మరికొన్ని చిట్కాలు !
* ఆయుర్వేదంలో తిప్ప తీగని సర్వరోగ నివారిణి అంటుంటారు. దీని ఆకులని రసంగా తీసి కొంచెం తులసి ఆకుల రసంతో కలిపి సేవిస్తే దోమల ద్వారా వచ్చే రోగాలు దరి చేరవని నిపుణులు సూచిస్తున్నారు.
* మూడు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్‌ని ఒక బకెట్ గోరు వెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేసినా దోమ కాటు నుంచి కాపాడుకోవచ్చు.
* శారీరక దృఢత్వంతో పాటు రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్న వారు త్వరగా ఎటువంటి రోగాలకి గురికారు. ఆఖరుకి దోమ వల్ల వచ్చే రోగాలకి కూడా.. ! కాబట్టి నిత్యం వ్యాయామం, మెడిటేషన్ తప్పనిసరిగా చేయాలి. చివరగా దోమ తెరలని వాడడం మర్చిపోకండి.


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని