Healthy Breakfast: పోహా-మూంగ్‌ దాల్‌ దోశ - try this dosa made from poha and moong dal
close
Published : 03/09/2021 17:41 IST

Healthy Breakfast: పోహా-మూంగ్‌ దాల్‌ దోశ

పెసరపప్పు, అటుకులు (పోహా)... పోషక విలువలు పుష్కలంగా ఉన్న వీటిని ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అందుకు తగ్గట్టే వీటితో వివిధ రకాల వంటలు చేస్తుంటారు చాలామంది. అయితే రెండింటినీ కలిపి ఏదైనా కొత్త రెసిపీ తయారు చేసుకోవాలనుకుంటే ‘పోహా-మూంగ్‌ దాల్‌ దోశ’ ట్రై చేయచ్చు.

ఆ శ్రమ లేకుండా!

సాధారణంగా దోశలు తయారుచేసుకోవాలంటే ముందు రోజే రాత్రి పిండిని పులియబెట్టుకోవాలి. అయితే ఈ దోశలకు ఆ అవసరం లేదు. అటుకులు, పెసరపప్పును గంటన్నర పాటు నీటిలో నానబెట్టుకుంటే చాలు. సులభంగా తయారుచేసుకునే ఈ దోశలను బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు ఈవెనింగ్‌ స్నాక్స్‌, పార్టీ స్నాక్స్‌లలో కూడా భాగం చేసుకోవచ్చు. మరి ఈ సూపర్‌ హెల్దీ రెసిపీని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం రండి..

పోహా-మూంగ్ దాల్‌ దోశ

కావాల్సిన పదార్థాలు

* అటుకులు (పోహా) - ఒక కప్పు

* పెసర పప్పు (మూంగ్‌దాల్‌) - ముప్పావు కప్పు

* మెంతులు - ఒక టీస్పూన్

* తురిమిన కొబ్బరి - అర కప్పు

* సన్నగా తరిగిన పచ్చి మిర్చి- ఒక టీస్పూన్

* అల్లం - అర టీస్పూన్

* కొత్తిమీర – పావు కప్పు

* జీలకర్ర- అర టీస్పూన్

* ఉప్పు - రుచికి సరిపడా

* నెయ్యి - తగినంత

తయారీ విధానం

ఒక బౌల్ నీటిలో అటుకులు, పెసరపప్పు, మెంతులు వేసి గంటన్నర పాటు నానబెట్టండి. గంటన్నర తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి వడగట్టి తురిమిన కొబ్బరి వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరో బౌల్‌లోకి తీసుకుని అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు కూడా జత చేసి దోశ పిండిలా తయారుచేసుకోవాలి. ఇప్పుడు నాన్‌స్టిక్ ప్యాన్‌ వేడి చేసి కొద్దిగా నీళ్లు చల్లాలి. ఆ తర్వాత ఫోర్క్‌కు క్లాత్‌ను చుట్టి ప్యాన్‌పై రుద్దాలి. అనంతరం ముందుగా రడీ చేసుకున్న బ్యాటర్‌ను ప్యాన్‌పై పోయాలి. గరిట సహాయంతో దోశ రౌండ్‌ షేప్‌ వచ్చేలా చేసుకోవాలి. దోశ అంచుల చుట్టూ నెయ్యి వేసి మీడియం సైజు మంటపై కాల్చుకోవాలి. దోశ గోధుమ రంగులోకి మారిన తర్వాత తిరగేసి కాల్చాలి. మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకోవాలి. కొబ్బరి చట్నీ / సాంబార్‌తో కలిపి ఈ దోశలను తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలివే!

ప్రొటీన్లతో నిండి ఉండే పెసరపప్పును ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె జబ్బులతో బాధపడేవారు, రక్తపోటు బాధితులకు ఇది మంచి ఆహారమని చెప్పచ్చు. పెసరపప్పులో ఫైబర్‌తో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్‌ బి6 కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక తక్కువ క్యాలరీలు, కొవ్వులుండే పోహాను కూడా చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్త్రీలు, ముఖ్యంగా గర్భిణులలో రక్తహీనత సమస్యలను బాగా తగ్గిస్తాయి. గ్లూటెన్‌ ఫ్రీ కావడం వల్ల డయాబెటిస్‌ బాధితులు, గుండె, మూత్రపిండాల వ్యాధులు, చర్మ సమస్యలతో బాధపడేవారు వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవచ్చు.


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని