ఈ క్యాలీఫ్లవర్ సూప్‌తో ప్రయోజనాలెన్నో! - try this easy cauliflower soup recipe to chill in this monsoon season
close
Updated : 03/08/2021 18:43 IST

ఈ క్యాలీఫ్లవర్ సూప్‌తో ప్రయోజనాలెన్నో!

(Image for Representation)

తేలికగా జీర్ణమయ్యే సూప్‌లను ఏ కాలంలోనైనా ఇష్టంగా లాగించేస్తుంటారు చాలామంది. ఇక వర్షాకాలంలో చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి వీటినే ఎక్కువగా తీసుకుంటుంటారు. చికెన్‌, మటన్‌.. వంటి వాటితో పాటు రకరకాల కూరగాయలతో తయారుచేసే సూప్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి వాటిల్లో క్యాలీఫ్లవర్‌ సూప్‌ కూడా ఒకటి. ఫైబర్‌ పుష్కలంగా ఉండే దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీవక్రియ సక్రమంగా జరుగుతుంది. పైగా దీని తయారీకి పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఈ రుచికరమైన సూప్‌ తయారీ గురించి మనమూ తెలుసుకుందాం రండి.

క్యాలీఫ్లవర్‌ సూప్

కావాల్సిన పదార్థాలు

* క్యాలీఫ్లవర్‌ - 300 గ్రాములు

* ఉల్లిపాయ – ఒకటి

* వెల్లుల్లి - 10 నుంచి 12 రెబ్బలు

* రెడ్ చిల్లీఫ్లేక్స్‌ - అర టీస్పూన్

* ఆలివ్‌ నూనె- 2 నుంచి 3 టేబుల్‌ స్పూన్లు

* వెన్న – ఒక టేబుల్‌ స్పూన్

* వెజిటబుల్‌ స్టాక్ (కూరగాయలు ఉడికించిన నీరు) - 4 కప్పులు

* ఛీజ్‌- పావు కప్పు

* ఫ్రెష్‌ క్రీమ్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

* ఒరెగానో ఆకు

* నల్ల మిరియాల పొడి

* ఉప్పు- రుచికి సరిపడినంత

తయారీ విధానం

క్యాలీఫ్లవర్‌ ముక్కలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, నల్ల మిరియాల పొడి, చిల్లీఫ్లేక్స్‌ను తీసుకోవాలి. వీటికి ఆలివ్‌ నూనెను కలిపి సుమారు 200 డిగ్రీల వద్ద 10-15 నిమిషాల పాటు వేయించాలి. వీటిని ఓ బౌల్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు వెన్న, ఒరెగానో ఆకు, వెజిటబుల్‌ స్టాక్‌ కలిపి అయిదు నిమిషాల పాటు ఉడికించాలి. క్యాలీఫ్లవర్‌ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఎలక్ట్రిక్‌ బ్లెండర్‌ సహాయంతో మెల్లగా బ్లెండ్‌ చేయాలి. ఆ తర్వాత ఛీజ్‌, క్రీమ్‌ వేసి బాగా కలిసిపోయేవరకు ఉడికించాలి. చివరగా సర్వింగ్‌ బౌల్‌లోకి సూప్‌ తీసుకుని ఆలివ్ నూనె, మిగిలిపోయిన క్రీమ్‌, వేయించిన క్యాలీఫ్లవర్‌ ముక్కలు, వెల్లుల్లి, చిల్లీఫ్లేక్స్‌తో గార్నిష్‌ చేస్తే... రుచికరమైన క్యాలీఫ్లవర్‌ సూప్‌ సిద్ధం.

ఆరోగ్య ప్రయోజనాలు

క్యాలీఫ్లవర్‌ సూప్‌ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పెద్ద మొత్తంలో పోషకాలు శరీరానికి అందుతాయి. అవేంటంటే..!

* శరీరంలో చెడు కొవ్వును కరిగించే లక్షణాలు క్యాలీఫ్లవర్‌లో సహజంగా ఉంటాయి.

* ఇందులోని ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.

* విటమిన్‌-బి, సి, కెలతో పాటు క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం తదితర పోషకాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

* ఇందులోని సల్ఫోరఫేన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ వివిధ రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులను నివారిస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది.

* దీనిలోని కొలీన్ మెదడు పనితీరుని మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా రక్షణ కలిగిస్తుంది.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని