ప్రపంచంలోనే పొడవైన అమ్మాయి.. తనను చూసి నేర్చుకోవాల్సినవెన్నో! - turkey rumeysa gelgi confirmed as tallest woman living
close
Updated : 13/10/2021 18:22 IST

ప్రపంచంలోనే పొడవైన అమ్మాయి.. తనను చూసి నేర్చుకోవాల్సినవెన్నో!

(Photo: Youtube Screengrab)

ఒకటి కాదు... రెండు కాదు... రుమెయ్సా గెల్గీ చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో సహజీవనం చేస్తోంది. పుట్టుకతోనే దివ్యాంగురాలిగా ఈ భూమ్మీద అడుగుపెట్టింది. ఆ తర్వాత జన్యుపరమైన రుగ్మతల బారిన పడి సాధారణం కంటే వేగంగా ఎత్తు పెరిగింది. కాళ్లు, చేతులు కూడా విపరీతమైన పొడవు పెరిగాయి. వీటికి తోడు కొన్ని శారీరక సమస్యలతో వీల్‌ఛైర్‌ లేకపోతే కానీ ముందుకు అడుగేయలేని పరిస్థితి.

7 అడుగుల పొడవుతో గిన్నిస్‌కెక్కింది!

ఇలా అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటోన్నా రుమెయ్సా మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. తన ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తన సమస్యల గురించి నలుగురికీ చెబుతూ అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం 7 అడుగుల 7 అంగుళాల పొడవు ఉన్న ఈ టర్కీ యువతి ‘ప్రపంచంలో జీవించి ఉన్నవాళ్లలో అత్యంత పొడవాటి మహిళగా’ గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.

గిన్నిస్‌లో రెండోసారి!

ఇలా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కడం రుమెయ్సాకు కొత్తేమీ కాదు. 2014లో ‘ప్రపంచంలో అత్యంత పొడవైన టీనేజ్ యువతి’ గా మొదటిసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పుడు తన వయసు 18 ఏళ్లు కాగా... ఎత్తు 7 అడుగుల 0.09 అంగుళాలు. తాజాగా తన పొడవుతో మరోసారి గిన్నిస్‌లో చోటు సంపాదించిందీ యంగ్‌ వుమన్‌. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

అదే నా పొడవుకు కారణం!

‘రెండోసారి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కడం సంతోషంగా ఉంది. అయితే నేనిలా పొడవు పెరగడానికి ‘వీవర్స్ సిండ్రోమ్‌’ సమస్యే కారణం. ఇది చాలా అరుదుగా కనిపించే ఓ జన్యుపరమైన సమస్య. మా కుటుంబీకులు, పూర్వీకుల్లో ఎవరికీ ఈ సమస్య లేదు. ఇక టర్కీలో కేవలం నేను మాత్రమే ఈ సమస్యతో బాధపడుతున్నాను. దీని వల్ల సాధారణం కంటే వేగంగా పొడవు పెరుగుతున్నాను. ప్రస్తుతం నా రెండు చేతులు 24.5, 30.5 సెంటీమీటర్ల పొడవున్నాయి. ఇదే కాదు.. నాకు పుట్టుకతోనే Scoliosis (వెన్నెముక వంపు తిరగడం) అనే సమస్య ఉంది. దీనివల్ల పలు శారీరక సమస్యలు తలెత్తాయి. కొన్నేళ్ల క్రితం సర్జరీ చేసి నా వెన్నెముకలో రెండు టైటానియం రాడ్లను అమర్చారు. ఇలా నాకున్న శారీరక సమస్యలతో నా జీవిత కాలంలో ఎక్కువ సమయం చక్రాల కుర్చీలోనే గడుపుతున్నాను. వాకర్స్‌ ఫ్రేమ్‌ సహాయంతో మాత్రమే నడవగలుగుతున్నాను..’

అయినా నేనెప్పుడూ దిగులు చెందలేదు!

‘నాకున్న శారీరక సమస్యల కారణంగా ఎన్నో అవమానాలు, హేళనలు ఎదుర్కొన్నాను. అయితే ప్రస్తుతం వాటి గురించి ఆలోచించడం లేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నన్ను నేను వెతుక్కుంటున్నాను. సమస్యలను పక్కన పెట్టేసి ప్రశాంత జీవనం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాను. నా పొడవు గురించి నేను ఎప్పుడూ దిగులు చెందలేదు. ఎందుకంటే ఇదే నన్ను నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. రెండుసార్లు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లోకి ఎక్కేలా చేసింది. సోషల్‌ మీడియాలో ధైర్యంగా నా ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తాను. అదేవిధంగా నాకున్న సమస్యల గురించి వివరంగా చెబుతాను. వీటికి చాలామంది సానుకూలంగానే స్పందించి కామెంట్లు పెడుతుంటారు. ఇక బయటకు వెళుతున్నప్పుడు కూడా చాలామంది నాతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపుతారు. అప్పుడప్పుడు కొందరు సమాధానం చెప్పలేని ప్రశ్నలతో విసిగిస్తారు. అప్పుడు కొంచెం బాధ అనిపించినా కొద్దిసేపయ్యాక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తాను.’

నెట్‌ఫ్లిక్స్‌తో రిలాక్స్ అవుతుంటాను!

‘నా సమస్యలను అధిగమించడంలో నా కుటుంబ సభ్యుల పాత్ర మరవలేనిది. వారు నాకు అన్ని విషయాల్లో తోడుగా నిలుస్తున్నారు. ఇక రిలాక్స్ కావడానికి ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌ చూస్తాను. అమ్మతో ఎక్కువ సమయం గడుపుతాను. కుటుంబ సభ్యులతో కలిసి బయట డిన్నర్లకు వెళుతుంటాను. స్విమ్మింగ్‌ కూడా చేస్తుంటాను. ‘సుల్తాన్‌ కొజెన్‌’(ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తి) టర్కీలోనే ఉంటారని తెలుసు. అతను కూడా బ్రెయిన్ ట్యూమర్ వంటి సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. అయితే నేనెప్పుడూ అతనిని కలవలేదు. భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా కలుస్తాను.’

ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకోవాలి!

రెండోసారి గిన్నిస్‌ బుక్‌ సర్టిఫికెట్‌ అందుకోవడం గర్వంగా ఉంది. ఇది నా లక్ష్యాలను సాధించేందుకు మరింత స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ‘మనకున్న ప్రతి ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవాలి. మనల్ని మనం అంగీకరించుకోవాలి. ప్రేమించుకోవాలి. మన శక్తి సామర్థ్యాలను గుర్తించి అందులో ఉత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నా. మీరు కూడా అదే చేయండి’ అని స్ఫూర్తిని పంచుతోంది గెల్గీ.

అదే నా డ్రీమ్!

ఇక తన లక్ష్యం గురించి రుమెయ్సాను అడిగితే ‘నాకు సాఫ్ట్‌వేర్‌, కంప్యూటర్లపై బాగా అవగాహన ఉంది. ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్‌గా అనుభవం కూడా ఉంది. ఇటీవల వెబ్ డెవలపర్‌గా శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాను. STEM (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమేటిక్స్‌) రంగంలో పనిచేయాలన్నది నా చిన్నప్పటి కోరిక’ అని చెప్పుకొచ్చింది.
మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని