‘ఫాదర్స్ డే’ స్పెషల్ : అందుకే నాన్నే మా హీరో..! - vasundhara special feature on fathers day
close
Updated : 20/06/2021 19:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఫాదర్స్ డే’ స్పెషల్ : అందుకే నాన్నే మా హీరో..!

నాన్నతో మనకున్న అనుబంధాన్ని మరొక్కసారి నెమరువేసుకునే ప్రత్యేకమైన రోజే ‘ఫాదర్స్ డే’. ఈ సందర్భంగా- 'మీ నాన్నతో మీకున్న అనుబంధాన్ని పంచుకోండి' అంటూ 'వసుంధర.నెట్' ఇచ్చిన పిలుపుకి స్పందిస్తూ ఎంతోమంది - తమ తండ్రితో తమకున్న అనుబంధం గురించి; వారి జీవితంలో తమ తండ్రి పోషించిన పాత్ర గురించి ఎన్నో స్ఫూర్తిదాయకమైన విశేషాలను పంచుకుంటున్నారు. అలాగే నాన్న పట్ల తమకున్న ఎనలేని ప్రేమను మాటల్లో వర్ణించలేని వారు తమ తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని అందమైన ఫొటోల రూపంలో కూడా పంచుకుంటున్నారు. మరి అలాంటి- స్ఫూర్తిదాయకమైన అనుభవాలను, అందమైన జ్ఞాపకాలను మీరు కూడా ఒక్కసారి చూసేయండి..

పంపినవారు: అశ్రిత


పంపినవారు: ఆది నారాయణ


పంపినవారు: అనూష

నాన్న నాతో ఒక స్నేహితుడిలా ఉంటారు. నాన్న LIC ఆఫీసర్‌గా పదవీ విరమణ పొందారు. పని పట్ల ఎంత అంకితభావంతో, నిజాయతీగా ఉండాలి అనే విషయంలో నాన్నే నాకు స్ఫూర్తి. నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తారు. తప్పు చేసినా సున్నితంగా అర్థం అయ్యేలా చెప్తారు కానీ ఎప్పుడూ కోప్పడరు. నాన్నతో నా అనుబంధాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన వసుంధరకి ధన్యవాదాలు. నాన్నలందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు.


పంపినవారు: లత

నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. ఆయన ప్రోత్సాహంతో నేను ఆంధ్ర యూనివర్సిటీలో Msc చదివా. ఇంకా జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా కూడా చేశా. ఎన్నో Father's days వస్తుంటాయి. కానీ, ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే నాన్న ఆరోగ్యం బాగాలేదు. క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. మీరు మాతో ఉండాలని ఎంత బలంగా అనుకున్నా అది కష్టమని డాక్టర్‌ చెప్పారు. నాకు జన్మనిచ్చిన మీకు ఏం చేసినా రుణం తీరదు. మీరు మాతో ఇంకొంత కాలం ఉండాలని కోరుకోవడం తప్ప.
Happy Father's day nanna. I love you forever. 


పంపినవారు: రిషిత


పంపినవారు: దివ భట్

నాన్న.....అంటే నిజాయతీ, స్వాంతన, స్నేహం, విలువలు... స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం నాన్న..
చిన్నప్పటి నుంచి నాన్నను దగ్గరగా చూస్తూ పెరిగాను. నాన్న ఉదయాన్నే లేచి ప్రాణాయామం చేసి, భక్తి పాటలతో మమ్మల్ని మేల్కొల్పుతారు.  ఆరోజు చేయవలసిన పనుల ప్రణాళిక వేసుకుంటారు. కాసేపు దినపత్రిక చదువుతారు.
ఇలా రోజుని మంచి అలవాట్లతో ప్రారంభిస్తారు. మాకోసం రోజూ సమయం కేటాయిస్తారు. మేము రోజూ జరిగే విషయాల గురించి అభిప్రాయాలు పంచుకుంటాం, కాసేపు సరదాగా నవ్వుకుంటాం. నాన్నకు ఏదైనా తెలియని విషయం ఉంటే మమల్ని అడిగి తెలుసుకుంటారు. ఈ ఆధునిక కాలంలో మేము ఎదుర్కొనే సమస్యలను మా కోణం నుంచి అర్థం చేసుకుని పరిష్కరిస్తారు. ఎపుడైనా తప్పు చేస్తే, చాలా ఓపికతో మేము చేసిన పని గురించి మంచి, చెడులను విశ్లేషిస్తారు. మా ఆలోచనలను స్వీకరిస్తారు.
ఆర్థిక వ్యవహారాల గురించి కూడా చర్చిస్తారు. మంచి విలువలని పురాణాలలోని కథల ద్వారా తెలియపరుస్తూ ఉంటారు. ఆటలు, పాటలు, వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. జీవితంలో ఎలాంటి సమస్యనైనా  ఎదుర్కోవడానికి కావాల్సిన ధైర్యం, ఓర్పు మాకు నేర్పించారు. నాన్నకు ఇష్టమైన వంట చేయడం, మంచి పుస్తకాలను బహుమతిగా ఇవ్వటం.. తనతో మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ప్రతి మనిషి ఆలోచనలు, వాళ్లు చేసే పనులు, ఎంచుకునే మార్గాలపై తల్లితండ్రుల ప్రభావం చాలా ఉంటుంది. నేను ఉన్నత స్థాయికి ఎదిగి, నా సత్ప్రవర్తనతో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాను. ఇదే నాన్నకు నేను ఇచ్చే పెద్ద బహుమతి.
పితృదేవోభవ.
దివ భట్, కరీంనగర్.


పంపినవారు: దుర్గారావు

మా ఇష్టాలను తీర్చడానికి తన ఇష్టాలను కూడా వదులుకున్నాడు మా నాన్న. మా ఇంట్లో నాన్న అంటే అందరికీ భయం. కానీ మాకు మాత్రం ఆయనంటే చచ్చేంత ఇష్టం. ఎందుకంటే మాలో ఆనందాన్ని నింపి, అల్లారుముద్దుగా పెంచి, మాలోని లోపాలను సరిచేస్తూ, మా భవితకు పునాదులు వేస్తూ, మా గమ్యానికి దారి చూపేది మా నాన్నే. మా చదువుకు సంబంధించి అడిగిన వెంటనే  కావలసినవన్నీ సమకూరుస్తాడు. ఇప్పటి నుండే మాకు క్రమశిక్షణ, నిరాడంబరంగా ఉండటం నేర్చించారు. అందుకే నాన్న అంటే ఒక నమ్మకం. నాన్న అంటే ఒక ధైర్యం. నాన్న అంటే అభయం. నాన్న అంటే మమకారం. నాన్న అంటే కొంచెం కోపం. మొత్తానికి నాన్న అంటే విడదీయలేని బంధం. హ్యాపీ ఫాదర్స్ డే.
వి.జోషిత & వి.నేహంత్.


పంపినవారు: గీత


పంపినవారు: శ్రీనివాసులు


పంపినవారు: కళావతి


పంపినవారు: వేణుమాధవ్‌


పంపినవారు: హర్షిత


పంపినవారు: హరిత


పంపినవారు: హరిత

మా నాన్నపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు. నాన్న, ప్రతి ఒక్కరికి ఒక సూపర్ హీరో.. పిల్లలు తమ జీవితంలో ఎవరినైనా అనుసరించి, ఆదర్శంగా తీసుకుంటారంటే అది నాన్ననే. ఎవరూ తెలియని ఈ లోకంలో ఒక ముద్దు యువరాజుగానో, యువరాణిగానో మనల్ని పరిచయం చేసి, మనల్ని పోషించి, చదివించి సమాజానికి ఉన్నతంగా పరిచయం చేసే వ్యక్తి నాన్న.  అలాంటి నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

కొయ్యం హరిత, D/o మురళీ కృష్ణ.


పంపినవారు: జాహ్నవి


పంపినవారు: జెస్సికా


పంపినవారు: జ్యోతి ప్రియాంక


పంపినవారు: కిరణ్‌ కుమార్‌


పంపినవారు: లక్ష్మి


పంపినవారు: లతశ్రీ

మా నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్నా ఆ కఠినత్వానికి కారణం పిల్లల భవిష్యత్తుకు ఆయన పడే తపన. అలాంటి తండ్రి దేవుడి కన్నా మిన్న. 
మా నాన్న చిన్న తప్పు చేసినా తిడతాడు. నా చిన్నతనంలో మా నాన్న నన్ను తిడితే నాకు కోపం, ఏడుపు వచ్చేది. నేనంటే ఇష్టం లేదేమోనని అనుకునేదాన్ని. కానీ, తర్వాత అర్థమయ్యింది నాన్న నాకోసమే చెప్తున్నాడని.
నేను సమయాన్ని వృథా చేస్తున్న ప్రతిసారి నాకు మా నాన్నే గుర్తుకొస్తాడు. మా నాన్న నా కోసం రోజంతా చాలా కష్టపడుతున్నాడు. నేను మా నాన్న కోసం కష్టపడాలని.
మా నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.
Finally, My dad is my hero, My role model, My guide, and Everything. Happy Fathers Day to all


పంపినవారు: మానస


పంపినవారు: మాధురి

నాన్న నా చిన్నతనంలో అతి గారాబం చేశాడు. చదువుకునే సమయంలో స్ఫూర్తి నింపే ఎన్నో కథలను నాకు  చెప్పేవారు. నాకు ఏదైనా కష్టం వస్తే నాకంటే నాన్న గారు ఎక్కువగా బాధపడేవారు. అంతేకాక ధైర్యం చెప్పి ఆ బాధ నుంచి విముక్తి కలిగే ఉపాయాలు చెప్పేవారు. అందుకే నేను M.Tech వరకు చదివాను. ఆయన్నుంచి నేర్చుకున్నవి పేదలకు సహాయం చేయడం.. తనకు ఉన్నదాంట్లో మిత్రులకు, బంధువులకు ఏ విధంగా తోడ్పడాలో తెలియజేశారు. అందుకే మా నాన్న నాకు రోల్ మోడల్.


పంపినవారు: నిహారిక

మా నాన్న గారు నన్ను చాలా గారాబంగా పెంచారు. నా ప్రతీ అడుగులో ఎంతో స్ఫూర్తినిచ్చారు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. నిరాశా నిస్పృహలను దరికి రానివ్వరు. నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. చిన్నప్పటినుండి అమ్మ, నాన్న ఇద్దరు సమానంగా చూసుకున్నా మా నాన్నంటేనే ఎక్కువ ఇష్టం ఉండేది. నాకే కాదు ప్రతీ ఆడపిల్లకి తన తండ్రి అంటేనే ఎక్కువ ఇష్టం. నా మొదటి స్నేహితుడు, హీరో మా నాన్నే. నేనెంత పెద్దదాన్నైనా మా నాన్నకు ఎప్పటికీ యువరాణినే.


పంపినవారు: నౌమిక

నువ్వే మాకు స్ఫూర్తి.. 
నువ్వే మా ప్రాణవాయువు..
నీకు మా మీద ఉన్న ప్రేమ, నమ్మకం కొండంత.. 
దానిని తగ్గించదలచలేదు మా జీవితమంతా.. 
నీకు తీర్చుకోవాల్సిన రుణం చెప్పలేనంత..
నీవు పడుతున్న కష్టాన్ని మరువలేము..
నీవు అందిస్తున్న ధైర్యాన్ని దేనితోనూ కొలవలేము..
నీవు చెమటోడ్చి సంపాదిస్తున్న ధనాన్ని వృథా చేయలేము.. 


పంపినవారు: పద్మ

హాయ్, అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మా డాడీకి స్పెషల్‌గా "హ్యాపీ ఫాదర్స్ డే!" నా వయసు ఇప్పుడు 30. కానీ, ఇప్పటికీ నేను అడగకుండానే నా మనసులో ఉన్న కోరిక ఏంటో తెలుసుకుని ఆయన తీరుస్తారు. మా నాన్న అని చెప్పడం కన్నా దేవుడిచ్చిన గొప్ప ఫ్రెండ్ అని చెప్తాను. ఎంత దూరంలో ఉన్నా ఒక్క రోజు కూడా మాట్లాడకుండా మేమిద్దరం ఇప్పటిదాకా ఉండలేదు. ఇప్పటికీ ఆయన ఫోన్ వస్తే నా ముఖంలో చిరునవ్వే కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ నాకు ఇచ్చిన గిఫ్ట్ బుక్స్ అన్నీ నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. తండ్రి స్థానాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ భర్తీ చేయలేరని నా నమ్మకం. ఐ లవ్ యు డాడీ. ఫాదర్స్ డే సందర్భంగా మీకు నా మనసులో ఉన్న మాట చెప్పాను. హ్యాపీ ఫాదర్స్ డే టు యు డాడీ వన్స్ అగైన్.


పంపినవారు: పద్మావతి


పంపినవారు: పావని


పంపినవారు: ప్రభాకర్‌


పంపినవారు: ప్రణయ్‌

నాన్నే నా స్ఫూర్తి, నాన్నే నా ధైర్యం. భగవంతుడు నాకు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతుల్లో నాన్న మొట్టమొదటి బహుమతి. నా కుటుంబ బాధ్యతని సక్రమంగా నిర్వహించడానికి నాకు ఆదర్శంగా నిలిచిన నాన్నకి పితృదినోత్సవ శుభాకాంక్షలు.


పంపినవారు: రాజశేఖర్‌


పంపినవారు: రమ


పంపినవారు: రవి శంకర్‌


పంపినవారు: సాయి దీపిక


పంపినవారు: శైలజ


పంపినవారు: సమీర


పంపినవారు: సత్యశ్రీ


పంపినవారు: షబీనా


పంపినవారు: షకీలా పఠాన్‌


పంపినవారు: శిరీష


పంపినవారు: సౌజన్య


పంపినవారు: శ్రావణి


పంపినవారు: శ్రీలేఖ


పంపినవారు: శ్రీలేఖ


పంపినవారు: రేవతి


పంపినవారు: శ్రీలక్ష్మి


పంపినవారు: సృజిత

నా తండ్రి నా మొదటి గురువు. ఆయన తన జీవితమంతా కుటుంబానికి అంకితం చేశారు. మా ఇష్టాలు, కోరికలను తనవిగా చెప్పుకునేవారు. పితృ దినోత్సవ శుభాకాంక్షలు.


పంపినవారు: సుధాకర్‌


పంపినవారు: సుప్రజ


పంపినవారు: సురేఖ


పంపినవారు: శ్వేతారాణి


పంపినవారు: శ్వేత


పంపినవారు: సౌజన్య


పంపినవారు: విజయ్‌ కుమార్‌


పంపినవారు: వీరభద్రరావు


పంపినవారు: అశోక్‌


పంపినవారు: మమత


పంపినవారు: అనసూయ


పంపినవారు: భార్గవ్‌


పంపినవారు: సూరిబాబు


పంపినవారు: హర్షిత


పంపినవారు: దీపారాణి


పంపినవారు: దీపామృత


పంపినవారు: దివ్య శ్రీ


పంపినవారు: దుర్గా నాగలక్ష్మి


పంపినవారు: గీత శ్రీ


పంపినవారు: హరిత


పంపినవారు: హాసిని


పంపినవారు: కవిత


పంపినవారు: కుమారి


పంపినవారు: లలిత


పంపినవారు: లావణ్య


పంపినవారు: మహా


పంపినవారు: మమత


పంపినవారు: మణి


పంపినవారు: మనోజ్ఞ


పంపినవారు: నమ్రత


పంపినవారు: నందన


పంపినవారు: నరేంద్ర


పంపినవారు: నిఖిత


పంపినవారు: సాహితి


పంపినవారు: పద్మిణి


పంపినవారు: ప్రార్థన


పంపినవారు: పాండు


పంపినవారు: షర్మిల


పంపినవారు: రంగాచారి


పంపినవారు: రష్మి


పంపినవారు: రవి కుమార్‌


పంపినవారు: రవీందర్‌


పంపినవారు: రూప


పంపినవారు: యస్‌. రవీందర్‌


పంపినవారు: సాయి కృతి


పంపినవారు: సంతోషి


పంపినవారు: శ్వేత


పంపినవారు: శేఖర్‌


పంపినవారు: శ్రావ్య


పంపినవారు: సౌమ్య


పంపినవారు: అపర్ణ లీల


పంపినవారు: జెన్నీ స్టెల్లా


పంపినవారు: సుదీంద్ర


పంపినవారు: సుమన


పంపినవారు: మహ్మద్‌ అజాం


పంపినవారు: ఉపేందర్‌


పంపినవారు: వంశిప్రియ


పంపినవారు: వసంతరాణి


పంపినవారు: వెంకట సుబ్బమ్మ


పంపినవారు: స్రవంతి


పంపినవారు: విజయ్‌ కుమార్‌


పంపినవారు: వికాస్‌


తమ తండ్రి గురించి మరెంతోమంది పంచుకున్న ఆసక్తికర విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని