జామ... తిందామా! - vasundhara
close
Published : 17/03/2021 19:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జామ... తిందామా!

జామ పండుని ఎలా తిన్నా... రుచితో పాటూ పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. వీటితో పిల్లలకు జెల్లీలు, జామ్‌లు, మురబ్బాలు వంటివీ చేసి ఇవ్వొచ్చు.
పండు నుంచి విటమిన్‌ సి, లైకోపీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండేవారు రోజూ ఓ జామ పండు తింటే చాలు. ఇందులోని మెగ్నీషియం....మనం తీసుకునే ఇతర ఆహారపదార్థాల్లోని పోషకాలను సరిగా స్వీకరించడానికి సహకరిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపడంలో కీలకంగా పనిచేస్తాయి. క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి.
* ఎక్కువ పీచు, తక్కువ గ్లైసమిక్‌ ఇండెక్స్‌ ఉండే జామపళ్లు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. సోడియం, పోటాషియం నిల్వల్ని సమన్వయ పరిచి రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. ఇందులోని పోషకాలు ట్రైగ్లిజరాయిడ్లు, చెడు కొవ్వుని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
* డైటరీ ఫైబర్‌ ఎక్కువగా లభించే ఈ పండుని తినడం వల్ల మలబద్ధకం సమస్య అదుపులోకి వస్తుంది. ఒక జామపండుని తింటే రోజుకి అవసరమైన పన్నెండు శాతం పీచు శరీరానికి అందుతుంది. ఫలితంగా జీర్ణప్రక్రియ సక్రమంగా సాగుతుంది. దీన్నుంచి లభించే విటమిన్‌ ఎ కంటిచూపుని కాపాడుతుంది. క్యాటరాక్ట్‌ వంటి సమస్యలు పెరగకుండా అడ్డుకుంటుంది. దీనిలో లభించే ఫోలిక్‌ యాసిడ్‌ లేదా విటమిన్‌ గర్భిణులకు మేలు చేస్తుంది.


మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని