నిద్రనిచ్చే గుమ్మడి! - vasundhara
close
Published : 13/07/2021 02:14 IST

నిద్రనిచ్చే గుమ్మడి!

గుమ్మడితో ఏం వండినా.... రుచితో పాటూ శరీరానికి కావలసినన్ని పోషకాలు అందుతాయి. అవేంటో చూడండి.

గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-ఇ, బీటా కెరొటిన్లు అధికం. వీటి వల్ల నేత్ర సంబంధ సమస్యలు దరిచేరవు. సంతాన సాఫల్యతను పెంచుతుంది.

* ఇందులోని పీచు, విటమిన్‌-సి గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. వ్యాధినిరోధక శక్తినీ పెంపొందిస్తాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఎముక సాంద్రతను దృఢ పరుస్తుంది. ఇందులోని పోషకాలు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడనీయవు.

* గుమ్మడి పండులోని విటమిన్‌-ఎ శరీరంలో బీటా కెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా చూస్తుంది. నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది.

* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజల్ని తినొచ్చు. ఇవి మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడం వల్ల, ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని