పిల్లల ముందు గొడవలొద్దు! - vasundhara
close
Published : 12/03/2021 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల ముందు గొడవలొద్దు!

కుటుంబం అన్నాక రకరకాల సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. అంతేకానీ భార్యాభర్తలిద్దరూ ‘తప్పు నీదంటే.. నీదని’ పొట్లాటకు దిగొద్దు. ముఖ్యంగా పిల్లల ముందు అస్సలు గొడవ పడొద్దు. ఇది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎలాగంటే...
అభద్రత... చిన్నారుల ముందు తల్లిదండ్రులు పోట్లాడుకుంటూ ఉంటే  వారు అభద్రతకు గురవుతారు. దాంతో ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే పిల్లలు హాయిగా, సంతోషంగా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
ఏకాగ్రత లోపిస్తుంది... తరచూ అమ్మానాన్నలు గొడవ పడుతుంటే ఏం చేయాలో తోచదు. వారి చిన్న మనసులో భయం, ఆందోళన నిండిపోతాయి. దాంతో ఏ విషయంపై దృష్టి సారించలేరు. ముఖ్యంగా చదువుపై ఈ ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి వీలైనంత మటుకు పిల్లల ముందు ఎలాంటి గొడవలకు దిగకుండా భార్యాభర్తలిద్దరూ సంయమనం పాటించాలి.
అపరాధ భావం... తరచూ చిరుబుర్రులాడుకునే కుటుంబాల్లోని పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోవడంతోపాటు వారిలో తెలియకుండా అపరాధ భావమూ పెరిగిపోతుంది. కన్నవారి గొడవలకు తామే కారణమేమోనని అనుకుంటారు. ఆ భావన కాస్త వారి ఆత్మవిశ్వాసాన్ని  దెబ్బతీస్తుంది.
అబద్ధాలు చెప్పడం... ఇంట్లోని గొడవలను ఆపడానికి అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు.
మాట వినరు... తరచూ దెబ్బలాడుకునే అమ్మానాన్నలంటే చిన్నారులకు గౌరవ, మర్యాదలు ఉండవు. తల్లిదండ్రులు చెప్పినమాట వినిపించుకోరు. దాంతో రకరకాల సమస్యలు ఉత్పన్నం కావొచ్చు.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని