అందుకే మా దాంపత్య బంధం ఉత్తేజకరంగా ఉంది! - vidya balan reveals what it takes to keep the spark alive in marriage
close
Published : 07/07/2021 19:07 IST

అందుకే మా దాంపత్య బంధం ఉత్తేజకరంగా ఉంది!

సంసారమనే సాగరంలో ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్థలు రావడం సహజం. అలాంటి సమయాల్లోనే భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి. జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవాలి. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అప్పుడే ఆలుమగల అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. అలా కాదని చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూసుకుంటూ పోతే మాత్రం ఆ బంధం బీటలు వారే ప్రమాదముందంటోంది బాలీవుడ్‌ విలక్షణ నటి విద్యాబాలన్. ప్రత్యేకించి దాంపత్య బంధంలోఎదుటివారిని ఏమాత్రం పట్టించుకోకుండా, విలువ ఇవ్వకుండా మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మంచిది కాదంటోంది. ఎనిమిదేళ్ల క్రితం సినీ నిర్మాత సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ను వివాహం చేసుకున్న ఆమె నేటికీ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిమానం చూరగొంటోంది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

బాలీవుడ్‌లో భిన్నమైన పాత్రలతో అలరించే అతి తక్కువమంది నటీమణుల్లో విద్యాబాలన్‌ ఒకరు. ‘పరిణీత’, ‘ఇష్కియా’, ‘డర్టీ పిక్చర్‌’, ‘పా’, ‘కహానీ’, ‘బాబీ జాసూస్‌’, ‘బేగం జాన్‌’, ‘తుమ్హారీ సులు’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘శకుంతలా దేవి’ వంటి ఎన్నో విభిన్న చిత్రాల్లో నటించి మెప్పించిందామె. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలను ఎన్నో గెలుచుకుంది. ఇక ఆమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే... ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్‌ కపూర్‌తో ప్రేమలో పడిన విద్య... 2012లో పెద్దల అనుమతితో అతడిని వివాహం చేసుకుంది. అప్పటినుంచి ఓ వైపు గృహిణిగా, మరోవైపు నటిగా తన కెరీర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో భర్తతో తన అనుబంధం దృఢంగా మారడానికి గల కారణాలను అందరితో పంచుకుంది.

అలా చేస్తే బంధంలో ఆ స్పార్క్‌ పోతుంది!

‘ఆలుమగలు తమ మధ్య ప్రేమను నిలుపుకోవడం సులభమే... అందుకు ఇద్దరూ కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు, గొడవలు, మనస్పర్థలు రావడం సహజం. ఆ సమయంలోనే జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించాలి. పరస్పరం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రత్యేకించి ఎదుటివారిని ఏమాత్రం లెక్క చేయకుండా, పట్టించుకోకుండా, విలువ ఇవ్వకుండా మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మంచిది కాదు. ఇదెంతో బాధాకరమైన విషయం. అలా చేసినట్లయితే దాంపత్య బంధంలో ఉండే ఆ ‘స్పార్క్‌’ మాయమవుతుంది. ఇలా చేయకుండా జాగ్రత్తపడడం పైనే వివాహ బంధం సక్సెస్ అవడమనేది ఆధారపడి ఉంటుంది.

అందుకే మేమెంతో సంతోషంగా ఉన్నాం!

ఇద్దరి జీవితాలను ఒక్కటి చేసే పెళ్లి ఎన్నో విషయాలతో ముడిపడి ఉంటుందంటారు. అందుకు నేను కూడా అంగీకరిస్తాను. ఎందుకంటే ముక్కు, మొహం తెలియని వారితో జీవితాన్ని పంచుకోవడమంటే సాధారణ విషయమేమీ కాదు. జీవిత భాగస్వామి ఇష్టాయిష్టాలు, అభిరుచులకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. అందుకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా- ఎదుటివారిని ఏమాత్రం లెక్క చేయకుండా, విలువ ఇవ్వకుండా ప్రవర్తించడం మంచిది కాదు. మా ఎనిమిదేళ్ల వైవాహిక జీవితంలో నేను తెలుసుకున్నది ఇదే. అందుకే మేమెంతో సంతోషంగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ విషయంలో మనం జాగ్రత్తపడలేమో- అప్పుడే దాంపత్య బంధంలో సమస్యలు మొదలవుతాయి. వైవాహిక బంధం నిస్సారంగా మారుతుంది. అందుకే మా ఇద్దరి మధ్య బంధం మరింత దృఢంగా, ఉత్తేజకరంగా ఉండడానికి అన్ని రకాలుగానూ నేను ప్రయత్నిస్తాను” అంటూ తమ రిలేషన్‌షిప్‌ సీక్రెట్‌ గురించి చెప్పుకొచ్చిందీ అందాల తార.

ఇక సినిమాల విషయానికొస్తే... చివరిగా ‘శకుంతలా దేవి’ సినిమాలో కనిపించిన విద్య ప్రస్తుతం ‘షేర్‌నీ’ అనే సినిమాలో నటిస్తోంది. అమిత్‌ మసుర్కర్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఆమె అటవీశాఖ అధికారిణిగా కనిపించనుంది.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని