వీటికి దూరంగా.. సంతోషానికి దగ్గరగా..! - ways to always be happy
close
Published : 16/07/2021 18:00 IST

వీటికి దూరంగా.. సంతోషానికి దగ్గరగా..!

కష్టాలు.. కన్నీళ్లు.. సమస్యలు.. ఇవేవీ లేకుండా జీవితమంతా సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? కానీ ఒక్కోసారి అదుపు తప్పిన మనసులో కలిగే భావనల వల్ల ఉన్న ఆనందం కాస్తా ఆవిరైపోతుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి ఎదురై జీవితంపై విరక్తి చెందే సందర్భాలు కూడా లేకపోలేవు. అందుకే సంతోషాన్ని మన నుంచి దూరం చేసే కొన్నింటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో- అసలు సంతోషం దూరం కావడానికి తోడ్పడే అంశాలు ఏంటి? వేటిని దూరం చేసుకుంటే సంతోషం మనకు దగ్గరవుతుందో తెలుసుకుందామా..!

పగ పెంచుకోవద్దు!

కొన్ని కొన్ని విషయాల్లో పెద్దవాళ్లు పిల్లల మంచి కోరే కొన్ని సలహాలు ఇచ్చినా.. అవి వాళ్లకు రుచించకపోవచ్చు. ఈ క్రమంలో కొంతమంది ‘నువ్వేంటి నాకు చెప్పేది ’అన్నట్లుగా వారిపై పగ, ద్వేషం పెంచుకుంటుంటారు. దీనివల్ల మనకు ఒరిగేది ఏమీ ఉండకపోగా.. ఉన్న సంతోషం కూడా ఆవిరైపోతుంది. అందుకే మనసు, మెదడును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడు ఆనందం కూడా మీ వద్దే ఉంటుంది. అంటే 'మీ ప్రశాంతతే మీకు శ్రీరామ రక్ష' అన్నమాట!

అసూయకు ఆమడ దూరంలో..

సంతోషాన్ని దూరం చేసే అంశాల్లో అసూయ చాలా కీలకమైంది. ఇది పైకి కనిపించకపోయినా.. మన ప్రవర్తన, మాటతీరు బట్టి వ్యక్తమవుతూ ఉంటుంది. ఉదాహరణకు.. మీ ప్రాణ స్నేహితురాలు, మీరు మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒకేసారి పరీక్ష రాశారనుకోండి. ఈ పరీక్షలో మీ స్నేహితురాలు ఉత్తీర్ణత సాధించి, మంచి హోదా కలిగిన ఉద్యోగం వచ్చింది. మీకు రాలేదనుకుందాం.. ఇలాంటి పరిస్థితుల్లో ''తర్వాత పరీక్షల్లో నేను కూడా సాధించాలి అని అనుకోవాలి కానీ నాకు రాని ఉద్యోగం తనకు వచ్చిందంటూ'' ఆమెపై కారాలు, మిరియాలు నూరుతూ అసూయను పెంచుకోకూడదు. దీని వల్ల మన మానసిక ప్రశాంతతకే భంగం వాటిల్లుతుంది. అంటే ఇలాంటి ప్రతికూల ఆలోచనల వల్ల కూడా సంతోషం మనకు దూరం కావడానికి అవకాశం ఉంటుంది.

భయం, ఆందోళన..

మనసును కుంగదీసి, ఆనందాన్ని పోగొట్టే అంశాల్లో భయం, ఆందోళన కూడా ముఖ్యమైనవే. చిన్న విషయాలకే భయపడిపోవడం, జరగాల్సిన పనులు సక్రమంగా జరగవేమోనని లేదా అసలు జరగవని అనవసరంగా ఆందోళన చెందడం.. ఇలా ఉన్న సమయమంతా భయపడుతూ కూర్చుంటే.. ఇక సంతోషంగా ఉండటానికైనా, గడపడానికైనా సమయం ఎక్కడిది? ఇలాంటి భావనలు మనసులో చేరడం వల్ల మన మీద మనకుండే నమ్మకాన్ని కోల్పోతాం. అందుకే ఎలాంటి సందర్భాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం అలవరచుకోవడం మంచిది. దీంతో సానుకూల దృక్పథం, ఆనందం రెండూ మీ సొంతమవుతాయి.

విచారమా??

కొంతమంది ఎప్పుడు చూసినా విచారంగా, ఏదో కోల్పోయినట్లు కనిపిస్తారు. ప్రతి విషయానికీ ముభావంగా, చాలా డల్‌గా సమాధానమిస్తూ ఉంటారు. అలాగే సున్నిత మనస్కులు కూడా ఏ చిన్న విషయం గురించైనా కలత చెందుతూ ఉంటారు. ఎవరితోనైనా గొడవ పడినప్పుడు ఆవేశంతో ఒకరినొకరు తిట్టుకోవడం సహజం. అయితే కొందరు ఎప్పటి సంఘటనలను అప్పుడే వదిలేస్తారు. కానీ మరికొందరు మాత్రం వాటినే మళ్లీ మళ్లీ తలుచుకుని తెగ బాధపడిపోతూ ఉంటారు. ఇలా అనిపించినప్పుడు బాధపడుతూ కూర్చోడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెంటనే వాళ్ల దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా మీరు కూడా సంతోషంగా ఉంటారు.

భారీ అంచనాలు..

కొంతమంది పరిస్థితులు, సందర్భాల గురించి పట్టించుకోకుండా.. భవిష్యత్తుకు సంబంధించి లేదా వ్యక్తులకు సంబంధించి ఏవేవో అతిగా వూహించేసుకుంటూ ఉంటారు. ఇలా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నప్పుడు అవి నెరవేరకపోతే చాలా బాధపడుతూ ఉంటారు. అందుకే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని చేరుకోవడానికి ప్రయత్నించాలి. మనం కోరుకుని, ఇష్టపడి చేసిన పనిలో విజయం సాధిస్తే ఆ సంతోషానికి అంతేముంటుంది చెప్పండి!

ఇతరులపై ఆధారపడడం..

ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవించాలని అనుకుంటారు. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు. ఈ క్రమంలో మీ నిస్సహాయతను బయటపెట్టకుండా స్వతంత్రంగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేయాలి. తద్వారా తప్పక ఫలితం ఉంటుంది. అలాగే ఈ క్రమంలో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపై ప్రశాంతంగా, ఆనందంగా ఉండగలుగుతారు కూడా!

నిజాయతీ లేకపోవడం..

'ఒక్క అబద్ధమాడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్ధాలాడినా సరిపోదు..' అంటారు పెద్దలు. ఈ క్రమంలో- తెలిసో, తెలియకో, కావాలనో.. పొరపాటునో.. ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్పే ఉంటారు. అయితే నిజాయతీగా వ్యవహరించడం చాలా మంచి లక్షణం. అలా నిజాయతీగా ఉండే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి సంతోషంగా ఉండగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఎప్పుడూ సత్యమే పలకమంటున్నారు.

నిస్వార్థంగా..!

ఇతరులకు ఉపకారం చేసినప్పుడే మనకు కూడా తృప్తిగా ఉంటుంది. ప్రతి విషయంలో నేను, నా అంటూ స్వార్థంగా ఆలోచిస్తే ఈ లోకంలో మనకి మనం తప్ప ఎవరూ ఉండరు. అందుకే స్వార్థాన్ని పక్కన పెట్టి అందరితోనూ కలిసి మెలసి ఉంటూ వీలైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత, తృప్తి.. రెండూ సొంతమవుతాయి.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని