స్టీలు పాత్రలు మెరవాలంటే ఇలా చేయండి..! - ways to clean stainless steel in telugu
close
Updated : 13/07/2021 20:16 IST

స్టీలు పాత్రలు మెరవాలంటే ఇలా చేయండి..!

స్టీలు గిన్నెలో టీ పెట్టి, వేరే గదిలో స్నేహితురాలితో మాట్లాడుతూ ఉండిపోయింది కవిత. దాంతో టీ అంతా పొంగిపోయి గిన్నె మాడిపోయింది..

ఉదయాన్నే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌ చేసే పనిలో ఉన్న రాధ స్టవ్ మీద పెట్టిన పాల సంగతి మరిచిపోయింది.. ఇంకేముంది.. పాలన్నీ మరిగిపోయి గిన్నె మాడినట్లుగా తయారైంది..

వీరికే కాదు.. వంటింట్లో ఇలాంటి అనుభవాలు చాలామందికి నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. మరి, ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ స్టీలు పాత్రలను తిరిగి తళతళా మెరిపించడం ఎలా అని ఆలోచిస్తున్నారా?? అందుకోసం కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరి.. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

స్టీలు గిన్నెలు శుభ్రంగా ఉన్నప్పుడు తళతళలాడుతూ ఎంత మంచి లుక్‌ని ఇస్తాయో; వాటి మీద గీతలు పడినా లేదా వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోయినా పాత వాటిలా కనిపిస్తాయి. ముఖ్యంగా మనం రోజువారీ ఉపయోగించే స్టీలు గిన్నెలను శుభ్రం చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వాటిని శుభ్రం చేయడమే కాకుండా కొత్తవాటిలా మెరిపించేందుకు ఉపకరించే కొన్ని చిట్కాలు మీకోసం..

గోరువెచ్చని సోప్‌వాటర్‌తో..

రోజువారీ ఉపయోగించే స్టీల్ పాత్రలను శుభ్రం చేసేందుకు కూడా ఓ పద్ధతి ఉంది. దీని ప్రకారం ముందుగా చల్లని నీళ్లతో ఆ పాత్రపై ఎలాంటి పదార్థాలు లేకుండా పైపైన కడిగేయాలి. తర్వాత మెత్తని స్పాంజ్‌తో గోరువెచ్చని నీళ్లలో కలిపిన సోప్ మిశ్రమాన్ని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ స్టీల్‌పాత్రలపై ఏవైనా పదార్థాలు గట్టిగా అంటిపెట్టుకొని ఉంటే వాటిని తొలగించేందుకు స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్‌ను ఉపయోగించకూడదు. ఇందుకు నైలాన్ స్క్రబ్‌ని మాత్రమే ఉపయోగించాలి. ఫలితంగా పాత్రలపై ఎలాంటి గీతలు పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే స్టీల్ గిన్నెలను శుభ్రం చేసిన తర్వాత వాటిని మెత్తని వస్త్రంతో తుడుచుకొని కాసేపు ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటి మెరుపు ఎక్కువ కాలం నిలిచి ఉండడమే కాదు.. మంచి లుక్‌ని కూడా ఇస్తాయి.

ఏవైనా పదార్థాలు అంటుకున్నప్పుడు..

స్టీల్ పాత్రలను ఉపయోగించే క్రమంలో వాటికి అప్పుడప్పుడూ కొన్ని పదార్థాలు కూడా జిడ్డులా అంటుకుపోతూ ఉంటాయి. ఇందుకోసం స్టీల్ లేదా ఐరన్ స్క్రబ్‌ని ఉపయోగించకూడదు. అలా అంటుకుపోయిన పదార్థాలను సులభంగా వదిలించేందుకు బాగా మరిగించిన నీటిని ఉపయోగిస్తే సరి. దీనికోసం మనం చేయాల్సిందల్లా.. పదార్థం అంటుకున్న పాత్రలో తగినన్ని సలసలా మరిగించిన వేడినీళ్లు పోసి అవి చల్లారేవరకు ఆ పాత్రను కదపకుండా ఉంచడమే. ఆ తర్వాత స్పాంజ్ లేదా నైలాన్ స్క్రబ్‌ని ఉపయోగించి పాత్రని శుభ్రం చేస్తే అంటుకున్న పదార్థాలు సులభంగా తొలగిపోతాయి.

టొమాటో కెచప్‌తో..

ఈ రోజుల్లో మనం ఉపయోగించే స్టీల్ పాత్రలకు అడుగుభాగంలో రాగి పూత ఉండడం సర్వసాధారణం అయిపోయింది. ఇలాంటి పాత్రలకు స్టీల్ ఒక్కటే కొత్తగా ఉంటే సరిపోదు.. రాగి కోటింగ్ కూడా కొత్తదానిలా మెరవాలి. ఇందుకోసం వంటింట్లో అందుబాటులో ఉండే టొమాటో కెచప్‌ని ఉపయోగిస్తే సరి. రాగి కోటింగ్ ఉన్న ప్రాంతంలో కెచప్‌ని అప్త్లె చేసి పది నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత స్క్రబ్‌తో వాటిని శుభ్రం చేస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.

మాడిపోయినప్పుడు..

సాధారణంగా స్టీల్ పాత్రలు మాడిపోయినప్పుడు బ్రౌన్ కలర్‌లో మరకలు పడడమే కాకుండా అవి పాత్ర ఉపరితలానికి చాలా గట్టిగా అతుక్కుని కూడా ఉండిపోతాయి. ఇలాంటి వాటిని తొలగించాలంటే ముందుగా ఆ పాత్రలో నీళ్లు పోసి కాసేపు నానబెట్టాలి. ఆ తర్వాత అందులో రెండు చెంచాల బేకింగ్ సోడా వేయాలి. ఇలా చేయడం వల్ల పాత్రకు అంటుకున్న పదార్థాల అవశేషాలు సులభంగా తొలగిపోతాయి. తర్వాత నైలాన్ స్క్రబ్‌తో పాత్రలను శుభ్రం చేయడం ద్వారా మాడిపోయిన మరకలన్నీ పూర్తిగా వదిలిపోతాయి.

వెనిగర్‌తో..

పాత్రల్లో పాలు లేదా నీళ్లు ఎక్కువగా మరిగించినప్పుడు ఖనిజాలు ఎక్కువగా చేరడం వల్ల అడుగుభాగం అట్టకట్టినట్లుగా తయారవుతుంది. ఇలాంటప్పుడు మూడువంతుల నీళ్లలో 1/3 వంతు వెనిగర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాత్రలో పోయాలి. తర్వాత కాసేపు కదపకుండా పక్కన పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత వేడినీళ్లతో ఆ పాత్రని శుభ్రం చేయడం ద్వారా అడుగుభాగంలో చేరిన ఖనిజాలను పూర్తిగా తొలగించవచ్చు.

స్టీల్ మెరవాలంటే..

స్టీల్ పాత్రలు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలంటే అందుకోసం బేకింగ్ సోడా, నీళ్లు కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక క్లాత్ సహాయంతో పాత్రలకు అప్త్లె చేసి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత నీటి మరకలు పడకుండా మెత్తని వస్త్రంతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టీల్ పాత్రలు ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి.

స్టీల్ పాత్రలు కొత్తవాటిలా మెరుస్తూ ఉండాలంటే ఏం చేయాలి?? వాటికి ఉండే మరకలను ఎలా వదిలించాలి.. అనే అంశాల గురించి తెలిసిందిగా.. మరి, మీరు కూడా ఈ చిట్కాలను పాటించి చూడండి..!

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని