ఫర్నిచర్‌పై మరకలు మాయమిలా.. - ways to clean your furniture in telugu
close
Updated : 07/07/2021 20:07 IST

ఫర్నిచర్‌పై మరకలు మాయమిలా..

సరళ ఎంతో ముచ్చటపడి తనకు నచ్చిన మోడల్ డైనింగ్‌టేబుల్‌ని దగ్గరుండి మరీ తయారు చేయించుకుంది. కానీ కొన్ని రోజులు గడిచేసరికి దానిపై ఏవేవో మరకలు పడ్డాయి. ఎంత ప్రయత్నించినా అవి పోవడం లేదు సరి కదా కొత్తవి వచ్చి చేరుతున్నాయి. ఈ విధంగా ఫర్నిచర్‌పై పడిన మరకలను పోగొట్టాలని చాలా మంది గృహిణులు ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మరకలు శుభ్రం చేసే తీరు వల్ల ఫర్నిచర్ పాడయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో ఇంట్లోని ఫర్నిచర్‌ను సులభమైన పద్ధతుల్లో శుభ్రం చేసుకోవడమెలాగో ఓ సారి చూద్దామా..!

టూత్‌పేస్ట్‌తో..

సాధారణంగా డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు, గ్లాసులు పెట్టడం వల్ల వలయాల మాదిరిగా నీటి మచ్చలు ఏర్పడతాయి. వీటిని తొలగించడానికి టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. కొద్దిగా టూత్‌పేస్టుని తీసుకుని దానిని నీటితో పలుచగా అయ్యేలా కలపాలి. దీనిని మరకపై రాసి కొన్ని నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో తుడిచేయాలి. ఈ చిట్కాని ఉపయోగించి కేవలం డైనింగ్ టేబుల్ మీదనే కాదు కిటికీలు, తలుపులపై పడిన నీటిచుక్కల మరకల్ని కూడా సులభంగా వదిలించేయచ్చు.

ఫర్నిచర్ వ్యాక్స్‌తో..

సాధారణంగా ఫర్నిచర్‌పై ఏర్పడే మరకలు నీటి వల్లనే ఏర్పడతాయి. కాబట్టి వాటిని సులువుగా తొలగించడానికి ఫర్నిచర్ వ్యాక్స్‌ని ఉపయోగించవచ్చు. కొద్దిగా ఫర్నిచర్ వ్యాక్స్‌ని తీసుకుని మరకపై రాసి మెత్తని వస్త్రంతో తుడిచేయాలి. అప్పటికీ మరక వదలకపోతే.. మినరల్ స్పిరిట్‌లో ముంచిన మెత్తని వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది.

లిక్విడ్ బ్లీచ్‌తో..

చెక్కతో చేసిన ఫర్నిచర్‌పై ఏర్పడిన ఎలాంటి మరకనైనా లిక్విడ్ బ్లీచ్‌తో సులభంగా తొలగించవచ్చు. టూత్‌బ్రష్‌ను లిక్విడ్ బ్లీచ్‌లో ముంచి మరకపై సున్నితంగా రుద్దాలి. కొన్ని నిమిషాల తర్వాత మెత్తటి పొడి వస్త్రంతో తుడిచేస్తే మరక పోతుంది.
వీటిని కూడా ప్రయత్నించండి..

* అరచెంచా వెనిగర్‌ని ఒక కప్పు చల్లటి నీటిలో కలపాలి. ఈ మిశ్రమంలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి మరకపై తుడవాలి.

* గోరువెచ్చని నీటిలో సబ్బు కలిపి తుడిచినా మరక చాలావరకు పోతుంది.

* కొద్దిమొత్తంలో ఉప్పు తీసుకుని ఆలివ్ ఆయిల్‌తో ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరకపై రాసి కొంత సమయం తర్వాత తుడిచేయాలి.

* కొద్దిగా పెట్రోలియం జెల్లీని మరకపై రాసి మరుసటి రోజు వస్త్రంతో తుడిస్తే మరక వదిలిపోతుంది.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని