తెల్లజుట్టుకు చెక్ పెట్టండిలా..! - ways to cover gray hair naturally at home
close
Published : 01/08/2021 08:43 IST

తెల్లజుట్టుకు చెక్ పెట్టండిలా..!

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరినీ బాధిస్తున్న సమస్యల్లో జుట్టు తెల్లబడటం కూడా ఒకటి. అయితే వృద్ధాప్య లక్షణాల్లో భాగంగా కేశాలు తెల్లబడితే ఫర్వాలేదు. కానీ చిన్న వయసులోనే తెల్లగా అయిపోతుండటం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలను వినియోగించడం ద్వారా ఈ సమస్య నుంచి ఎలా బయటపడచ్చో తెలుసుకుందాం రండి..

సాధారణంగా జుట్టు తెల్లబడుతోంది అనగానే చాలామంది డై వేసుకోవడానికే మొగ్గుచూపిస్తారు. కారణం తక్కువ సమయంలోనే కేశాలను నల్లగా కనిపించేలా చేసుకోవచ్చు. అయితే కాస్త శ్రద్ధ వహిస్తే తీరిక సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

ఉసిరి రసం..

ఉసిరికాయల నుంచి తీసిన రసాన్ని రోజూ తాగడం ద్వారా జుట్టు తెల్లబడకుండా ఉండటమే కాదు.. తిరిగి నల్లగా కూడా మారుతుంది. అలాగే జుట్టురాలడం, చివర్లు చిట్లడం.. వంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. ఈ రసం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి సైతం చక్కని ఉపశమనం లభిస్తుంది.

డికాక్షన్‌తో..

ఉసిరికాయల్ని కొద్ది గంటల పాటు నానబెట్టాలి. తర్వాత అందులో చెంచా నీలగిరి తైలం (యూకలిప్టస్ ఆయిల్) కలిపి రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ మిశ్రమంలో ఒక గుడ్డు, కొద్దిగా నిమ్మరసం, పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా వేసుకుని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా తరచూ చేయడం వల్ల 15 రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. కేశాలు తిరిగి నలుపురంగులోకి మారడం మనం గమనించవచ్చు.

జామ ఆకులతో..

జుట్టుని తిరిగి నల్లగా చేయడానికి జామ ఆకులు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం కొన్ని జామ ఆకులు తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని తలకు అప్త్లె చేసుకుని కాసేపు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పెరుగుతో..

కొద్దిగా కరివేపాకు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. అందులో పావుకప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కేశాలకు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. 15 నుంచి 30 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత తలస్నానం చేయాలి. ఇది మన అమ్మమ్మల కాలం నుంచి పాటిస్తున్న చక్కని పద్ధతి.

అల్లం, తేనెతో..

కొద్దిగా అల్లం తీసుకుని దాన్ని మెత్తగా చేసి రసం తీసుకోవాలి. అందులో చెంచా తేనె కలుపుకుని రోజూ తాగడం ద్వారా కూడా కురులు తెల్లబడకుండా సంరక్షించుకోవచ్చు. అలాగే దీని వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి కూడా కాస్త ఉపశమనం లభిస్తుంది.

కొబ్బరినూనెతో..

కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో కురులకు బాగా మర్దన చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

ఇవి కూడా..

* ఆముదాన్ని కేశాలకు పట్టించి మృదువుగా మర్దన చేయాలి. కాసేపు ఆరనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

* వేపనూనెను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు.

* శీకాకాయ, ఉసిరిపొడి.. వంటి సహజసిద్ధమైన పదార్థాలను కూడా ప్రత్యామ్నాయాలుగా వినియోగించుకోవచ్చు.

* ఓట్స్, బ్లాక్‌టీ, నిమ్మరసం, బాదం నూనె.. ఇవన్నీ కేశాలకు తెల్లబడకుండా సంరక్షించడానికి ఉపయోగపడేవే..!

చూశారుగా.. తెల్లబడిన జుట్టుని తిరిగి నల్లగా మార్చుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో.. మీరు కూడా ఇవన్నీ గుర్తుంచుకుని ఫాలో అవండి.. నల్లగా నిగనిగలాడే కురులతో అందంగా మెరిసిపోండి..!

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని