ఒకరికొకరు దగ్గరయ్యే దారులెన్నో! - ways to get closer to your partner in telugu
close
Published : 28/06/2021 21:18 IST

ఒకరికొకరు దగ్గరయ్యే దారులెన్నో!

దాంపత్య బంధంలో ప్రతి క్షణమూ భార్యాభర్తలిద్దరికీ ఎన్నో మరపురాని మధురానుభూతుల్ని పంచుతుంది. ఇక పెళ్త్లెన కొత్తలో అయితే ఇలాంటి మధుర భావనలకు అంతుండదంటే అది అతిశయోక్తి కాదు. 'నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేను' అన్న రీతిలో ఒకరినొకరు కాసేపైనా వదిలిపెట్టకుండా సమయం గడుపుతుంటారు కొందరు. అదే మరికొందరైతే పెళ్త్లె పట్టుమని పది రోజులు కూడా గడవక ముందే పని.. పని.. అంటూ తమ ఉద్యోగంపైనే శ్రద్ధ చూపిస్తుంటారు. ఫలితంగా భాగస్వామికి దగ్గర కావడానికి కూడా ప్రయత్నించరు. దీంతో తొలిరోజుల్లోనే వారి అనుబంధంలో అసంతృప్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది తర్వాత మరింత పెరిగే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి పెళ్త్లెన నాటి నుంచే దంపతులిద్దరూ వారి ఉద్యోగానికి ఓవైపు సమయం కేటాయిస్తూనే.. మరోవైపు ఒకరితో మరొకరు వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించడం మంచిది. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరిలో ఒకరికొకరు దగ్గరగా ఉన్నామనే భావన కలగడానికి కొన్ని పద్ధతులను పాటించాలంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

వీటికి దూరంగా...

పెళ్త్లెన కొత్తలో భార్యాభర్తలిద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలియకపోవచ్చు. కాబట్టి ముందుగా ఇద్దరూ తమ తమ అభిరుచులు, ఇష్టాయిష్టాలు.. వంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు ఇద్దరూ కలిసి వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. అలాగని ఏ ఫోనో, ల్యాప్‌టాపో పట్టుకొని అన్యమనస్కంగా మాట్లాడుకోవడం కాదు.. ఇద్దరూ ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్లి దగ్గరగా కూర్చొని ఒకరి కళ్లలోకి మరొకరు కళ్లు పెట్టి చూస్తూ.. తమకు సంబంధించిన విషయాలన్నీ పంచుకోవాలి. అప్పుడే వారి మధ్య ఐ కాంటాక్ట్ పెరిగి 'మేమిద్దరం ఒకరికొకరం, ఇద్దరం దగ్గరగా ఉన్నాం..' అన్న భావన కలుగుతుంది. దాంపత్య బంధంలో భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు దగ్గరవడానికి, రొమాన్స్ పండించుకోవడానికి కూడా ఈ ఐ కాంటాక్టే ప్రధానమంటున్నాయి అధ్యయనాలు. కాబట్టి మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీ.. వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లన్నీ దూరం పెట్టి ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకుంటే ఆ అనుబంధంలో అన్యోన్యతకు అవధులే ఉండవు.

కలిసి చదువుకోవాలి..

అదేంటి.. ఇప్పుడే కదా ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపాలన్నారు.. అప్పుడే మళ్లీ చదువుకోమంటున్నారు.. అనుకుంటున్నారా? అవును.. దంపతులిద్దరూ కలిసి గడపడానికి ఎలాగైతే సమయం కేటాయించుకుంటారో.. అలాగే కలిసి చదవడం వల్ల కూడా వారి అన్యోన్యత హద్దులు దాటుతుందంటున్నాయి పలు అధ్యయనాలు. అదెలాగంటే.. దంపతులిద్దరికీ పుస్తకాలు చదవడమంటే ఇష్టమనుకోండి.. ఎవరి పుస్తకం వారు చదువుకోవడం కాకుండా.. ఇద్దరూ కలిసి ఒక మంచి రొమాంటిక్ ప్రేమకథ పుస్తకాన్ని చదువుతూ.. అందులోని పాత్రల్లో మిమ్మల్ని వూహించుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, రొమాన్స్ చేస్తూ.. సమయం గడపాలి. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఆ కథ మరింత రసవత్తరంగా సాగడంతో పాటు మీ మధ్య అనుబంధం కూడా రెట్టింపై.. ఒకరికొకరు మరింత దగ్గరవుతారంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

ఇచ్చిపుచ్చుకోవాలి..

అలాగే భార్యాభర్తలిద్దరిలో ఒకరికొకరు దగ్గరగా ఉన్నామన్న భావన కలగాలంటే ఒకరినొకరు అభినందించుకోవడం మరవద్దంటున్నారు నిపుణులు. డ్రస్ బాగుందని, వంట రుచిగా ఉందని.. ఇలా ప్రతి విషయంలోనూ ఒకరినొకరు అభినందించుకోవడం చాలా ముఖ్యం. అది కూడా ఫోన్లోనో లేదంటే దూరంగా ఉండో కాదు.. ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటి మీద ఓ ముద్దు పెడుతూ వారిలో మీకు నచ్చిన విషయాల్ని పంచుకోవాలి. అప్పుడు దంపతుల మధ్య అనుబంధం పది కాలాల పాటు పదిలంగా ఉండడమే కాదు.. మరింత దగ్గరయ్యామన్న భావనా చిగురిస్తుంది. ఇలాంటి అభినందనలతో పాటు మధ్యమధ్యలో ముద్దులు, కౌగిలింతలు.. వంటి రొమాంటిక్ పనులనూ ఇందులో భాగం చేయాలి. అప్పుడే అన్యోన్యత మరింత బలపడుతుంది.

పనుల్నీ పంచుకోవాలి..

ప్రస్తుత బిజీ లైఫ్‌స్త్టెల్‌లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమైపోయింది. అలాంటప్పుడు దంపతులిద్దరూ ఇంట్లోని ప్రతి పనినీ సమానంగా పంచుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల పనులు సునాయాసంగా పూర్తవడం మాత్రమే కాదు.. వారి మధ్య సాన్నిహిత్యం కూడా క్రమంగా పెరుగుతుంది. అంతేకాదు.. ఈ పనులు కలిసి చేసుకునేటప్పుడు ఇద్దరికీ సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి మాట్లాడుకుంటూ చిలిపిగా, సరదాగా పూర్తి చేయడం వల్ల పనిభారం అంతగా అనిపించదు సరికదా.. ఉన్న సమయంలోనే ఒకరికొకరు మరింత దగ్గరయ్యే అవకాశం కూడా లభిస్తుంది. ఇలా దంపతులిద్దరూ ప్రతి పనినీ పంచుకుంటూ ముందుకు సాగడం వల్ల వారి అన్యోన్య దాంపత్యం పది కాలాల పాటు పచ్చగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కేవలం ఇవే కాదు.. రోజూ ఇద్దరూ కలిసి వ్యాయామం చేయడం, ఒకరికి నచ్చినట్లుగా మరొకరు తయారవడం, ఒకరికి నచ్చిన పనులు మరొకరు చేయడం, భాగస్వామిని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, ముద్దాడడం.. వంటివన్నీ ఇద్దరిలో దగ్గరితనం పెంపొందించేవే అంటున్నారు నిపుణులు!

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని