నల్లుల బెడద ఎక్కువగా ఉందా..! - ways to get rid of bed bugs in telugu
close
Published : 10/07/2021 19:31 IST

నల్లుల బెడద ఎక్కువగా ఉందా..!

'ఛ.. ఏం నల్లులో ఏమో.. రాత్రిళ్లు నిద్ర పోనివ్వడం లేదు.. కుట్టి కుట్టి చంపుతున్నాయి.. ఏం చేసినా మళ్లీ పుట్టుకొచ్చేస్తున్నాయి.. ఇవి శాశ్వతంగా పోయే మార్గమే లేదా..' నల్లుల సమస్యతో విసిగి వేసారిన వారు ఈ విధంగా అనుకోవడం సహజమే. ఎందుకంటే నల్లులు కుట్టడం వల్ల నిద్ర లేకపోవడం మాట పక్కన పెడితే రకరకాల అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది నల్లులు కనిపించిన వెంటనే వాటిని చంపడానికి క్రిమిసంహారక మందుల్ని మంచంపై స్ప్రే చేసేస్తారు. ఇలా చేయడం వల్ల నల్లుల బెడద పూర్తిగా వదలదు సరికదా.. తిరిగి మన ఆరోగ్యమే పాడవుతుంది. కాబట్టి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ నల్లుల బెడద నుంచి విముక్తి పొందడం చాలా మంచిది. అలాంటి కొన్ని చిట్కాలు మీ కోసం..

వ్యాక్యూమ్ క్లీనర్‌తో..

నల్లులు ఉండటానికి అవకాశం ఉండే ప్రదేశాలను వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. అల్మరాలు, గది మూలలు, సోఫా సెట్, కుర్చీలు, మంచం మూలలు ఇలా అన్ని చోట్లా వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి. కొన్ని సందర్భాల్లో ఫ్లోరింగ్ పగుళ్లలోనూ నల్లులు దాక్కునే అవకాశాలుంటాయి. కాబట్టి అక్కడ కూడా శుభ్రం చేసి ప్లాస్టర్ లేదా గ్లూను ఉపయోగించి ఆ పగుళ్లను మూసేయాలి. తర్వాత డిస్‌-ఇన్ఫెక్టంట్‌ ఫ్లోర్‌ క్లీనర్‌తో ఇల్లు శుభ్రం చేయాలి.

వేడి నీళ్లతో..

మంచంపై పరిచే దుప్పట్లు, బెడ్‌కవర్స్, పిల్లోకవర్స్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. వేడినీటిని ఉపయోగించి వీటిని ఉతకడం వల్ల వాటిపై నల్లులు ఉన్నట్లయితే సులభంగా వదిలిపోతాయి. అలాగే వారానికోసారి మంచంపై వేసే దుప్పట్లు, పిల్లోకవర్స్ మారుస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పడక గదిని కూడా తరచూ వేడినీటితో శుభ్రంగా తుడుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నల్లుల బాధ నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది.

సూర్యరశ్మి ప్రసరించేలా..

నల్లులు వేడిని ఎక్కువగా తట్టుకోలేవు. కాబట్టి గదిలోకి సూర్యరశ్మి తప్పనిసరిగా ప్రసరించేలా చూసుకోవాలి. నల్లులను పూర్తిగా నివారించడానికి పరుపు, మంచాన్ని ఎప్పటికప్పుడు ఎండలో వేస్తూ ఉండాలి. సూర్యరశ్మి వల్ల నల్లులు చాలా వరకు నశిస్తాయి. పరుపుని ఎండలోంచి తీసి లోపల వేసుకొనే ముందు ఓసారి వ్యాక్యూమ్ క్లీనర్‌తో బాగా శుభ్రం చేయాలి. అలాగే మెత్తని వస్త్రంతో మంచాన్ని కూడా శుభ్రంగా తుడవాలి.

సుగంధ ద్రవ్యాలతో..

సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే వాసనను నల్లులు తట్టుకోలేవు. కాబట్టి ఉతికిన తర్వాత దుప్పట్లు, బెడ్‌కవర్లను సువాసన వచ్చే ఫ్యాబ్రిక్ కండిషనర్‌లో ముంచడం మంచిది. అలాగే లావెండర్ నూనెకి కూడా నల్లులను సంహరించే లక్షణం ఉంటుంది. ఈ నూనెలో ముంచిన వస్త్రంతో కుర్చీలు, మంచాన్ని తుడిస్తే నల్లులు నశిస్తాయి. అదేవిధంగా కొన్ని పుదీనా ఆకులను ఉంచడం ద్వారా కూడా నల్లుల సమస్యకు చెక్ పెట్టొచ్చు. మిరియాలు, యూకలిప్టస్ ఆయిల్ కూడా నల్లులను అంత త్వరగా దరిచేరనివ్వవు.

వాషింగ్‌సోడాతో..

కేవలం మంచాలకు మాత్రమే నల్లులు పరిమితం కావు. కొన్నిసార్లు అవి మన వార్డ్‌రోబ్‌కి సైతం పాకుతాయి. కాబట్టి ఎప్పుడూ వస్త్రాలను వాషింగ్ సోడా ఉపయోగించి ఉతకాలి.

బేకింగ్ సోడాతో..

బేకింగ్ సోడాను కొద్దిగా తీసుకుని దుస్తుల మడతల్లో, పరుపు కింద అక్కడక్కడా చల్లుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే నల్లుల బెడద ఉండదు.

ఇవి కూడా..

* నల్లులు ఉన్నచోట ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ను స్ప్రే చేయాలి.
* కేవలం ఒక గదికి మాత్రమే నల్లులు పరిమితం కావు కాబట్టి ఇల్లు మొత్తం డిస్‌-ఇన్ఫెక్టంట్‌ ఫ్లోర్‌ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని