గొడవ పడి మూడ్ పాడైందా? ఇలా చేయండి..! - ways to recover after a fight in telugu
close
Published : 24/10/2021 12:01 IST

గొడవ పడి మూడ్ పాడైందా? ఇలా చేయండి..!

ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గొడవలకు దారితీస్తుంటాయి. భిన్న వ్యక్తిత్వాలు కూడా అందుకు కారణం కావచ్చు. అయితే చాలామంది వాగ్వాదం జరిగిన తర్వాత కూడా పదే పదే అవే ఆలోచనలతో ఇబ్బంది పడుతుంటారు. ‘నా మూడంతా పాడైపోయింది’ అని బాధపడుతుంటారు. ఈ క్రమంలో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చంటున్నారు మానసిక నిపుణులు. మరి, అవేంటో చూద్దాం రండి...

ధ్యానం చేయండి..

ఎవరితో అయినా వాగ్వాదం జరిగిన తర్వాత చాలామందిలో ఆ కోపం అలానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దానిని ఇతరులపై కూడా చూపిస్తుంటారు. ఈ క్రమంలో శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చు. ప్రాణాయామం, యోగా వంటివి ఈ కోవకే చెందుతాయి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా ఒత్తిడి కలిగించే కార్టిసాల్‌ హార్మోన్‌ తీవ్రతను తగ్గిస్తుంది. కోపం వచ్చినప్పుడు కండరాలు పట్టేస్తుంటాయి. ఈ వ్యాయామాలు చేయడం వల్ల అవి తిరిగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.

ఆ ప్రదేశాన్ని ఊహించుకోండి...

కొంతమంది అప్పుడప్పుడు తమకు నచ్చిన ప్రదేశాలను ఊహించుకుంటారు. ఈ క్రమంలో వారు తాము అక్కడ ఎలా ఎంజాయ్‌ చేస్తామో ఊహించుకుంటూ స్వాంతన పొందుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. మీరు కూడా గొడవ జరిగిన తర్వాత మీకు నచ్చిన ప్రదేశాన్ని ఊహించుకోండి. ఆ ప్రదేశం గుడి, బీచ్‌, జలపాతం, పార్క్‌.. ఏదైనా కావచ్చు.

అలా నచ్చిన ఆహారంతో...

ప్రయాణాలు చేసినప్పుడు శరీరం అలసటగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే హాయిగా అనిపిస్తుంది. అలాగే ఏదైనా వాగ్వాదం జరిగిన తర్వాత చల్లటి నీళ్లతో స్నానం చేయండి. ఆ తర్వాత నచ్చిన వంటకంతో ఆహారం తీసుకుంటే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. అదే సమయంలో నచ్చిన సినిమా చూస్తే జరిగిన గొడవ సంగతి మర్చిపోయి మంచి మూడ్‌లోకి ఇట్టే వచ్చేస్తారు.

దానిని పక్కన పెట్టండి...

మనుషుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. ఒకవేళ జరిగిన దానిలో మీరే కరెక్ట్‌ అని భావిస్తే అవతలి వ్యక్తి ఎక్కడ తప్పు చేస్తున్నారో ఆలోచించండి. ఈ చిన్న జీవితంలో గొడవల వల్ల సాధించేది ఏమీ ఉండదని గమనించండి. కాబట్టి, వాళ్లే ముందు మాట్లాడాలనే ఈగోని పక్కన పెట్టి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకరికొకరు తమ సమస్యల గురించి వివరంగా చెప్పుకోలేకపోవడం వల్లే ఈ ప్రపంచంలో సగం గొడవలు జరుగుతున్నాయని నిపుణులు అంటుంటారు. కాబట్టి, గొడవ జరిగిన తర్వాత అవతలి వ్యక్తి వైపు నుంచి ఆలోచించి ఆ సమస్యను అక్కడితో ముగించే ప్రయత్నం చేయండి. హ్యాపీగా ఉండండి!


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని