పసిపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - ways to take care of newborn baby in telugu
close
Updated : 07/09/2021 17:11 IST

పసిపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నేహ వాళ్ల పాపకు మూడునెలలు. పాప ఏడ్చినప్పుడల్లా తను ఏడుపు ఆపాలని.. ఎత్తుకొని జోల పాడుతూ పైకి, కిందికి తెగ వూపేస్తుంటుంది. అయినా వూరుకోకపోతే కాళ్లపై పడుకోబెట్టుకుని ఇంకాస్త వేగంగా పైకి, కిందికి అంటుంది.

ఇక ప్రసన్నకు ఐదు నెలల బాబున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఏదైనా స్వీటో, పండో తింటుంటే.. వాడికి కూడా కాస్త రుచి చూపిస్తుంటారు.

ఇలాంటి పనులు చాలామంది తల్లిదండ్రులు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ పసిపిల్లల విషయంలో ఇలాంటి కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇవి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ చిన్న పిల్లల విషయంలో చేయకూడని కొన్ని పనులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

నిద్రపోతున్నారా?

పాపాయి నిద్రపోయేటప్పుడు తల్లులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే కొందరు తల్లులు పాపాయి పడుకున్నప్పుడు కూడా వారి నోట్లో పాల బాటిల్ అలాగే ఉంచుతుంటారు. దీనివల్ల పిల్లల కడుపులో గ్యాస్ చేరడం, పాలు గొంతులో పడి వారు అసౌకర్యంగా ఫీలవడం జరుగుతుంది. అలాగే పిల్లలు ఏడవకుండా ఉండాలని ఇలా ఎప్పుడూ వారి నోట్లో ఏదో ఒకటి పెట్టి ఉంచడం వారి లేత చిగుళ్లకు, రాబోయే దంతాల ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి పిల్లలు నిద్రపోయేటప్పుడు ఇలాంటి వస్తువులేమీ వారి నోట్లో ఉండకుండా జాగ్రత్తపడడం మంచిది. మెలకువగా ఉన్నప్పుడు కూడా ఎక్కువసేపు ఉంచకపోవడం మంచిది.

బలవంతంగా నడిపించద్దు..

కొంతమంది పిల్లలు తొమ్మిది నెలలకే నడిచేస్తే, మరికొందరు పిల్లలు ఏడాదిన్నర దాటినా పూర్తిగా నడవలేరు. అయితే కొందరు తల్లిదండ్రులు పాపాయి త్వరగా నడవాలని.. వారికి నడిచే వయసు రాకముందే బలవంతంగా నడిపించడం, వాకర్‌లో వేయడం.. వంటివి చేస్తుంటారు. దీనివల్ల పిల్లల కాళ్ల ఎముకలపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఫలితంగా కాళ్లు వంకరగా మారి పెద్దయ్యాక సరిగ్గా నడవలేకపోవడం గమనించవచ్చు. కాబట్టి పిల్లల్ని బలవంతంగా నడిపించకుండా వారంతట వారే నడిచేంతవరకు మీ సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించాలి.

ఏడ్చినప్పుడు..

పసిపిల్లలు ఎంత సున్నితమైన వారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎంతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది తల్లులు పిల్లలు ఏడుస్తున్నారంటే.. వారి ఏడుపు ఆపడానికి పిల్లల్ని ఎత్తుకుని ముందుకు, వెనక్కీ అనడం, వేగంగా వూపడం.. వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటి పనులు పిల్లల్ని అప్పటికప్పుడు ఏడుపు ఆపేలా చేయొచ్చు గానీ.. ఇలా చేయడం వల్ల పిల్లల సున్నితమైన నరాలపై ఒత్తిడి పడే అవకాశాలెక్కువ. తద్వారా వారి మెదడుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి పిల్లల్ని మరీ అంత గట్టిగా కాకుండా.. కాస్త నెమ్మదిగా జోల పాట పాడుతూ బుజ్జగించాలి. వారికి ఆటవస్తువులు, పక్షుల్ని చూపించి వారి ఏడుపు ఆపాలే గానీ వారిని శారీరకంగా మరింత ఒత్తిడికి గురిచేసేలా వ్యవహరించకూడదు.

రుచి కోసం అసలే వద్దు..

పిల్లలకు ఆర్నెళ్ల వరకు తల్లిపాలు తప్ప ఇతర ఆహారమేదీ అరగదని, ఎందుకంటే ఈ సమయంలో వారి జీర్ణవ్యవస్థ ఇతర ఆహార పదార్థాలను అరిగించుకునేంతగా వృద్ధి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలాకాలం క్రితమే వెల్లడించింది. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తేనె, స్వీట్లు.. మొదలైనవి తినిపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇది వారి ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అలాగే దీనివల్ల వారి జీర్ణవ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఇతర ఆహార పదార్థాలేవీ వారికి అందించకపోవడం మంచిది.

ఇవి కూడా!

* సాధ్యమైనంత వరకు పిల్లలకు తల్లిపాలే ఇవ్వాలి. బాటిల్ పాలను వారికి అందించకపోవడమే ఉత్తమం.

* పసిపిల్లలకి ఆకలైనా, దప్పికైనా.. తల్లిపాలతోనే తీరతాయి. కాబట్టి ప్రత్యేకించి ౬ నెలల లోపు వారికి దాహమవుతుందేమోనని నీరు తాగించడం మంచిది కాదు. అనవసరంగా నీళ్లు తాగించినట్లయితే వారి శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలన్స్ అదుపు తప్పే ప్రమాదం ఉంది.

* పిల్లలకు మరీ పసి వయసులో ఉన్నప్పుడు టబ్‌లో స్నానం చేయించడం కూడా మంచిది కాదు.

* అదేవిధంగా పసిపిల్లలు తియ్యకుండా మరీ ఎక్కువసేపు ఏడవడం కూడా మంచిది కాదు.. ఇలాంటి సందర్భాలలో ఎంతకీ ఏడుపు ఆపకపోతుంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించడం అవసరం.


Advertisement


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని