మా కొత్త ప్రయాణానికి మీ ఆశీర్వాదం కావాలి! - yami gautham gets married to uri director aditya dhar in a private ceremony
close
Published : 24/06/2021 16:56 IST

మా కొత్త ప్రయాణానికి మీ ఆశీర్వాదం కావాలి!

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అందుకే ఉన్నంతలోనే అత్యంత ఘనంగా ఈ వేడుకను జరుపుకోవాలనుకుంటారు. ఇక సెలబ్రిటీలైతే చెప్పే పనే లేదు. మెహెందీ, హల్దీ, విందులు, వినోద కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఈ శుభకార్యాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటారు. కానీ కరోనా ఆంక్షలతో ఎలాంటి సందడి లేకుండానే సోలో లైఫ్‌కి గుడ్‌ బై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు కొంతమంది సెలబ్రిటీలు.

డైరెక్టర్‌తో కలిసి ఏడడుగులు!

ఇటీవల బాపు బొమ్మ ప్రణీత ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఏడడుగులు నడవగా... తాజాగా బాలీవుడ్‌ నటి యామీ గౌతమ్‌ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఆదిత్యధర్‌తో కలిసి ఆమె పెళ్లిపీటలెక్కింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. అనంతరం యామీనే తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ గర్ల్‌గా పరిచయమై!

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన యామీ మొదట ఐఏఎస్‌ కావాలనుకుంది. కానీ కొన్ని పరిస్థితులు ఆమెను సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసేలా చేశాయి. ఈ క్రమంలో సినిమా అవకాశాలను వెతుక్కుంటూ 20 ఏళ్ల వయసులో ముంబయికి చేరుకుంది. మొదట కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించిన ఆమెకు ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ యాడ్‌ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ క్రేజ్‌తోనే మొదట బుల్లితెర, ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టి వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. 2009లో ‘ఉల్లాస ఉత్సాహ’ అనే కన్నడ చిత్రంతో తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించిన యామీ... ఆ తర్వాత ‘నువ్విలా’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అనంతరం ‘విక్కీ డోనర్’తో బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ సినిమా పెద్ద హిట్‌ కావడంతో అక్కడ ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ‘బద్లాపూర్‌’, ‘సనమ్‌ రే’, ‘కాబిల్‌’, ‘సర్కార్ 3’, ‘ఉరి:ది సర్జికల్‌ స్ట్రైక్‌’, ‘బాలా’, ‘గిన్నీ వెడ్స్‌ సన్నీ’ లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు ఆమె ఖాతాలో చేరాయి. అదే సమయంలో ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ను కూడా పలకరించింది. వీటితో పాటు తమిళ, పంజాబీ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది.

మా కొత్త ప్రయాణానికి మీ ఆశీర్వాదం కావాలి!

ఇలా తన అందం, అభినయంతో సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న యామీ... ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పెళ్లి చేసుకుంది. ‘ఉరి’ సినిమాతో ‘ఉత్తమ దర్శకుడి’గా జాతీయ అవార్డు అందుకున్న ఆదిత్యధర్‌తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. అనంతరం తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో మేం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాం. కరోనా నిబంధనల నేపథ్యంలో అతి తక్కువమంది సమక్షంలో ఈ వేడుక జరిగింది. పెళ్లితో ప్రారంభమైన మా ఈ కొత్త ప్రయాణానికి మీ అందరి దీవెనలు కూడా కావాలి’ అని రాసుకొచ్చింది.

సంప్రదాయ దుస్తుల్లో!

పెళ్లి వేడుకలో రెడ్‌ కలర్‌ శారీలో దర్శనమిచ్చిన యామీ తలపై అదే కలర్‌ దుపట్టాను ధరించింది. ఇక పెళ్లి దుస్తులకు తగ్గట్టుగా ధరించిన ఆభరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి. ఇక వరుడు ఆదిత్య క్రీమ్‌ కలర్‌ షేర్వాణీలో ముస్తాబయ్యాడు. ఇలా పెళ్లి దుస్తుల్లో ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న యామీ-ఆదిత్యల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కాజల్‌ అగర్వాల్‌, కృతి సనన్‌, దియామీర్జా, తహీరా కశ్యప్‌, శ్రద్ధాకపూర్ తదితర సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని