Dearvasuarticle News, Headlines, Breaking News, Articles
close
Published : 28/06/2021 07:22 IST
Facebook Share WhatsApp Share Telegram Share

నాకిప్పుడు మూడో నెల.. వ్యాక్సిన్‌ వేయించుకోవాలా?వద్దా?

నాకిప్పుడు మూడో నెల. నేను కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చా?

- ఓ సోదరి

ప్రమాదకర జబ్బుల బారినపడకుండా గర్భిణులకు వైద్యులు వ్యాక్సిన్లు ఇస్తారు. ఉదాహరణకు ప్రతి గర్భిణికి టెటనస్‌, ఫ్లూ, టీడాప్‌ (టెటనస్‌, డిఫ్తీరియా కోరింత దగ్గు) వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేస్తారు. వీటివల్ల ఆమె గర్భంలో పెరిగే శిశువుకు కూడా రక్షణ లభిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత వ్యాక్సిన్‌ వేసే వరకూ ఈ రక్షణ ఉంటుంది. కొవిడ్‌ ప్రబలుతున్న ఈ విపత్కర సమయంలో గర్భవతులు, పాలిచ్చే తల్లులను రక్షించుకోవడం చాలా అవసరం. ఈ విషయాల్లో మార్గదర్శకాలను నిర్దేశించే పదికి పైగా జాతీయ వైద్య సంఘాలన్నీ గర్భిణులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు దీనిపై స్పష్టమైన సూచనలు ఇవ్వలేదు. ఇప్పటికే అమెరికా, చైనా, యూరప్‌ దేశాలన్నీ గర్భిణులకు కొవిడ్‌ టీకా ఇస్తున్నాయి. అయితే అక్కడి వ్యాక్సిన్ల రకం పూర్తిగా వేరు. మన దేశంలో ఇస్తున్న రెండు (కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌) వ్యాక్సిన్లు గర్భిణులపై ఎంత వరకు, ఎలా పనిచేస్తాయనే దానిపై ఇంతవరకు అధ్యయనాలు జరగలేదు కాబట్టి ప్రభుత్వం ఇంకా సూచనలు జారీ చేయలేదు. మన వ్యాక్సిన్లు రెండూ ఫ్లూ వ్యాక్సిన్‌ను పోలి ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఫ్లూ వ్యాక్సిన్‌ గర్భవతులకు సురక్షితమని తెలియడం వల్ల, వ్యాక్సిన్‌ కంటే కొవిడ్‌ వైరస్‌ ఎన్నో రెట్లు ప్రమాదకరం కావడం వల్ల  ఎక్కువ శాతం మంది వైద్యులు గర్భిణులకు వ్యాక్సిన్‌ తీసుకోమని చెబుతున్నారు.

మీ ప్రశ్న అడగండి

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని