Tagsrelatednews News, Headlines, Breaking News, Articles
close

సంబంధిత వార్తలు

PM CARES: కరోనా బాధితులకు భరోసా

కరోనా మహమ్మారి సృష్టించిన పెను విపత్తులో ఆప్తుల్ని కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు, తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని అనాథలుగా మారిన చిన్నారులకు సాంత్వన చేకూర్చే వివిధ చర్యల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. కన్నవారి మృతితో అనాథలైన చిన్నారుల జీవితానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు విద్యనందించే ఏర్పాటు చేయనున్నారు. బాధిత పిల్లలు 18 ఏళ్ల వయసుకు వచ్చే నాటికి వారి పేరున రూ.10 లక్షల మూల నిధిని పీఎంకేర్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ద్వారా ప్రభుత్వం సమకూర్చుతుంది. కార్మిక రాజ్య బీమా సంస్థ, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థల సభ్యుల కుటుంబాలకు చేయూతనిచ్చే చర్యల్ని ప్రకటించింది.

Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘గాంధీ’లో చికిత్సలు!

కొవిడ్‌ రోగులకు చికిత్సలు అందించడంలో ముందున్న హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు.. ప్రస్తుతం బ్లాక్‌ఫంగస్‌ బాధితులకూ సేవలు అందించనున్నారు. ఇందుకు నేత్ర, ఈఎన్‌టీ, ప్లాస్టిక్‌ సర్జరీతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటైంది. శనివారం ఓ బ్లాక్‌ఫంగస్‌ రోగికి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం గాంధీలో 90 మంది వరకు బ్లాక్‌ఫంగస్‌తో చేరినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రికి కూడా రోగుల తాకిడి పెరిగింది. శనివారం నాటికి 127 మంది బ్లాక్‌ఫంగస్‌తో చేరారు. 9 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. నగరంలోని ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బ్లాక్‌ఫంగస్‌ రోగులు చేరుతున్నారు.