Tagsrelatednews News, Headlines, Breaking News, Articles
close

సంబంధిత వార్తలు

Vaccine: టీకా తీసుకున్న 95% మందికి వైరస్‌ సోకలేదు

వ్యాక్సిన్లతో కరోనాకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని అపోలో గ్రూపు ఆసుపత్రుల తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా 24 నగరాల్లోని 43 అపోలో ఆసుపత్రుల్లో దాదాపు 31,621 మంది హెల్త్‌ కేర్‌ సిబ్బందిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం రుజువైంది. ఈ వివరాలను అపోలో ఆసుపత్రి గ్రూపు బుధవారం మీడియాకు విడుదల చేసింది. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ మొదటి లేదా రెండు డోసులు తీసుకున్న 95 శాతం సిబ్బందికి ఎలాంటి వైరస్‌ సోకలేదని అందులో తేలింది. కేవలం 4.28 శాతం మంది మాత్రం స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని, ఇందులో కేవలం ముగ్గురికి మాత్రమే ఐసీయూ అవసరమైందని, వారంతా కోలుకున్నారని పేర్కొన్నారు.

CoronaVaccine: టీకా వ్యవధి తగ్గించాలి

డెల్టా రకం వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొవిషీల్డ్‌ రెండో డోసు టీకా కాల పరిమితిని 12-16 వారాల నుంచి 8 వారాలకు తగ్గించడం మేలని ప్రముఖ వైద్యులు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. బ్రిటన్‌లో గత డిసెంబరులో అప్పటి ఒరిజినల్‌ రకం వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని కాల వ్యవధిని పెంచారని, ఆ తర్వాత డెల్టా వేరియంట్‌ ప్రాబల్యం పెరగడంతో టీకా వ్యవధిని తగ్గించారని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాక్సిన్‌ విధానంలో ఇలా మార్పులు చేస్తూ పోవాలన్నారు. ప్రస్తుతం మన దేశంలో 50% డెల్టా రకం వైరస్‌ ఉన్నట్లు ప్రభుత్వ అధ్యయనాలే చెబుతున్నందున... కొవిషీల్డ్‌ రెండో డోసు కాల వ్యవధిని 8 వారాలకు తగ్గించి ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి గరిష్ఠ రక్షణ కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.  ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేశంలోని ప్రస్తుత పరిస్థితులను, చేపట్టాల్సిన చర్యలను శ్రీనాథ్‌ రెడ్డి విశ్లేషించారు.