చమురు కొనుగోలుపై ఐరోపా దేశాలు మాకు నీతులు చెబుతున్నాయా?: జైశంకర్‌

అమెరికా పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్ అక్కడ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేస్తున్నా ఆ దేశం నుంచి భారత్ ఎందుకు చమురు కొనుగోలు చేస్తుంది అనే ప్రశ్నకు తనదైన రీతిలో బదులిచ్చారు. రష్యా నుంచి భారత్ ఒక నెలలో కొనుగోలు చేస్తున్న చమురు విలువ ఐరోపా దేశాలు ఒక పూటలో కొనుగోలు చేస్తున్న చమురు విలువతో సమానమని ఎద్దేవా చేశారు

Published : 12 Apr 2022 14:43 IST

మరిన్ని

ap-districts
ts-districts