Cheteshwar Pujara: షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో పుజారా సిక్సర్‌ వీడియో వైరల్

టీమ్‌ఇండియా టెస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా ప్రస్తుతం మ్యాచ్‌లేవీ లేకపోవడంతో ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ససెక్స్‌ టీమ్‌ తరఫున ఇప్పటికే నాలుగు సెంచరీలు బాదిన అతడు తాజాగా మిడిల్‌సెక్స్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో ఓ సిక్సర్‌ కొట్టాడు. అప్పర్‌కట్‌ షాట్‌ ఆడటంతో ఆ బంతి స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

Published : 08 May 2022 14:21 IST

Tags :

మరిన్ని