Cyclone Asani: అసని ఎఫెక్ట్‌.. సముద్రం అల్లకల్లోలం!

 అసని ఎఫెక్ట్‌.. సముద్రం అల్లకల్లోలం! అసని తీవ్ర తుపాను ప్రభావంతో సముద్ర తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మరింది. ఉప్పాడ- కాకినాడ,విశాఖపట్నం తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. గాలుల ఉధృతికి కాకినాడ పోర్టులో నౌకలోకి సరకును చేర్చే బాడ్జ్‌ తీరానికి కొట్టుకొచ్చింది. బీచ్ రోడ్డు పైకి అలలు ఎగిసి పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 10 May 2022 17:20 IST

Tags :

మరిన్ని