Early Monsoon: వర్షాకాలం ముందుగానే వస్తోంది..!: ఐఎండీ

నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈనెల 27న కేరళను తాకడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి జూన్ 1న రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉండగా ఈసారి 5 రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

Published : 14 May 2022 15:05 IST
Tags :

మరిన్ని