Kondeti Chitti Babu: గెలిచిన తర్వాత కనిపిస్తే కదా.. ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ

గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న కోనసీమ జిల్లా పి.గన్నవరం MLA కొండేటి చిట్టబ్బాయికి కొండుకుదురు గ్రామంలో నిరసన సెగ తగిలింది. గ్రామానికి వచ్చే మార్గం సరిగా లేదని వంతెన కట్టించాలని ఎప్పటినుంచో అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేని ఓ మహిళ నిలదీశారు. ఈ సమస్యను ఎప్పుడూ తన దృష్టికి తీసుకురాలేదని ఎమ్మెల్యే అనడంతో గెలిచిన తర్వాత మీరు కనిపిస్తే కదా అని మహిళ ఎదురు ప్రశ్నించారు.

Published : 15 May 2022 13:58 IST

Tags :

మరిన్ని