Ukraine Crisis: డాన్ బాస్‍పై దృష్టి సారించిన రష్యా సేనలు

ఉక్రెయిన్ లోని వ్యూహాత్మక నగరం మరియుపోల్ ను స్వాధీనం చేసుకుని యుద్ధంలో కీలక విజయం సాధించిన రష్యా... డాన్ బాస్ ప్రాంతంపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఆధునిక ఆయుధాలతో ముమ్మర దాడులు చేస్తోంది. డాన్ బాస్ లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. కాల్పుల విరమణకు తాము సిద్ధంగా లేమని ఉక్రెయిన్ స్పష్టం చేసింది.

Published : 22 May 2022 18:20 IST

Tags :

మరిన్ని