Congress: కాంగ్రెస్‌ పార్టీని వీడిన కపిల్‌ సిబల్‌

కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బతగిలింది. వరుస పరాజయాలతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న హస్తం పార్టీకి సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో జీ-23 నేతగా పేరొందిన సిబల్‌ ఉత్తర్‌ప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడిన కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీకి ఈ నెల 16నే రాజీనామా చేసినట్లు వెల్లడించారు.

Published : 25 May 2022 16:10 IST

Tags :

మరిన్ని