Monkey: ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న వానరం

బిహార్​లోని రోహ్​తాస్​ జిల్లాలో.. ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. షాజుమా ప్రాంతంలో ఉండే డాక్టర్​ అహ్మద్​ క్లినిక్​లోకి.. చికిత్స కోసం ఓ కోతి తన పిల్లతో పాటు వచ్చింది. ఆ రెండు వానరాలకు అహ్మద్​ చికిత్స అందించారు. ఎత్తైన ప్రాంతం నుంచి జారిపడడం వలన గాయాలపాలైన వానరాలు చికిత్స కోసం డాక్టర్  వద్దకు వచ్చాయి. ​కోతి తన పిల్లతో పాటు కుర్చీలో కూర్చొని డాక్టర్  వద్ద​ చికిత్స తీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్‌గా మరింది.

Published : 10 Jun 2022 11:57 IST
Tags :

మరిన్ని