PM Modi: ‘బై బై మోదీ’ హ్యాష్ ట్యాగ్‌తో మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ప్రధాని మోదికి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రజలకు చేసిందేమీ లేదని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉన్న టివోలీ థియేటర్ సిగ్నల్ వద్ద ఈ భారీ ఫ్లెక్సీ వెలిసింది. జులై 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

Published : 29 Jun 2022 14:52 IST

Tags :

మరిన్ని