వృద్ధురాలికి మత్తు మందు.. బంగారంతో నకిలీ వైద్యుడి పరారీ

సికింద్రాబాద్ గోపాలపురం (Gopalapuram) పీఎస్ పరిధిలో నకిలీ వైద్యుడు చేతివాటం ప్రదర్శించాడు. నిమ్స్ ఆస్పత్రిలో సర్జన్ అని ఓ వృద్ధురాలి (old woman)ని నమ్మించి ఆమె బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్‌ను దొంగిలించి పరారయ్యాడు. సుజాత అనే మహిళను రైల్లో పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి తాను వైద్యుడినని నమ్మబలికాడు. తన ఆరోగ్య సమస్యలకు సంబంధించి చికిత్స నిమిత్తం తనను కలిసేందుకు.. గురుద్వారా వద్ద ఉన్న సాయి వినాయక లాడ్జికి రమ్మని చెప్పడంతో ఆమె వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమెకు మత్తుమందు ఇచ్చి.. మెడపై ఉన్న 10 గ్రాముల బంగారంతోపాటు సెల్ ఫోన్ తీసుకుని పారిపోయాడు.

Updated : 08 Jun 2023 19:44 IST

మరిన్ని