Viral Video: చైన్ స్నాచర్‌కు చుక్కలు చూపించిన బాలిక

పదేళ్ల బాలిక చైన్ స్నాచర్‌కు చుక్కలు చూపించిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. పుణే నగరంలో రోడ్డుపై తన నానమ్మతో కలిసి బాలిక వెళ్తుండగా.. ఓ చైన్ స్నాచర్  ఎదురుపడ్డాడు. బైక్‌పై వచ్చిన ఆ వ్యక్తి వృద్ధురాలిని మాటల్లో పెట్టి మెడలోని బంగారు గొలుసు కొట్టేసేందుకు ప్రయత్నించాడు. వృద్ధురాలు ప్రతిఘటించగా.. పక్కనే ఉన్న పదేళ్ల బాలిక చేతిలో ఉన్న సంచితో ఆ చైన్ స్నాచర్‌పై దాడి చేసింది. దీంతో గొలుసు వదిలి ఆ వ్యక్తి పారిపోయాడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన CCTV దృశ్యాలు వైరల్‌గా మారడంతో.. తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published : 10 Mar 2023 18:11 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు