NTR: ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అభిమానుల సంబరాలు చూశారా?

నటుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతోపాలు విదేశాల్లోనూ అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. పుట్టినరోజు నాడు తమ హీరోని ఒక్కసారి చూసి.. శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. ‘జై ఎన్టీఆర్‌.. జై జై ఎన్టీఆర్‌’, ‘హ్యాపీ బర్త్‌డే తారక్‌ అన్నా’ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై టపాసులు కాల్చి, కేకులు కట్‌ చేసి.. సంబరాలు చేసుకున్నారు.

Published : 20 May 2022 15:26 IST
Tags :

మరిన్ని