Odisha Train Accident: 141 మంది ఏపీ ప్రయాణికుల ఫోన్లు స్విచ్చాఫ్‌..!

ఒడిశాలో ప్రమాదానికి (Odisha Train Accident) గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 482 మంది ప్రయాణించారని.. వారిలో 267 మంది క్షేమంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 20 మందికి తేలికపాటి గాయాలైనట్లు తెలిపింది. యశ్వంత్‌పూర్ రైల్లో రాష్ట్రానికి చెందిన 89 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారని, వీరిలో 49 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపింది.  మరో 28 మంది వివరాలు తేలాల్సి ఉందని వెల్లడించింది.  కోరమాండల్, యశ్వంతపూర్  ఎక్స్‌ప్రెస్‌లలో కలిపి 141 మంది ప్రమాణికుల ఫోన్లు పనిచేయడం లేదని తెలిపింది. దీంతో కొందరు తెలుగు ప్రయాణికులు ఏమయ్యారో, ఎక్కడున్నారో అనే అంశం ఆందోళన కలిగిస్తోంది.

Published : 04 Jun 2023 09:19 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు