IND vs BAN: రెండో టెస్టు తొలి రోజు భారత్‌దే పైచేయి.. మ్యాచ్‌ హైలైట్స్‌ ఇవిగో!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు టీమ్‌ఇండియాదే పైచేయి. బౌలర్లు అశ్విన్‌, ఉమేశ్ యాదవ్ ధాటిగా బౌలింగ్‌ చేయండంతో ఒక దశలో 213/5తో పటిష్ఠంగానే కన్పించిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. మామినుల్‌ హక్(84) రాణించినా ఇతర ఆటగాళ్లెవరూ సహకరించలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 227 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. మరి, తొలి రోజు మ్యాచ్‌ హైలైట్స్‌ను మీరూ చూసేయండి.

Published : 22 Dec 2022 22:02 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు