UN Study: ప్రమాదంలో ఆనకట్టలు.. భయాందోళనకు గురిచేస్తోన్న నివేదిక!

జల వనరులను కాపాడుకోవడంలో ఆనకట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 57 వేల వరకు డ్యామ్‌లు ఉన్నాయి. వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి, తాగునీటి కోసం ప్రపంచ దేశాలు ఈ నీటినే ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం జలవనరులపై విడుదల చేసిన నివేదిక భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా వరకు డ్యామ్‌లు.. 2050 నాటికి 26 శాతం మేర వాటి నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతాయని వెల్లడించింది. భారత్‌లో 3,700 ఆనకట్టలపై తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు తెలిపింది. 

Published : 10 Jan 2023 13:20 IST

Tags :

మరిన్ని