Vikarabad: షాకింగ్‌.. ఒకే వ్యక్తికి 38 బ్యాంకు ఖాతాలు..!

వికారాబాద్ జిల్లాలో ఇంటి రుణం కావాలని బ్యాంకు వెళ్లిన వ్యక్తి.. బ్యాంకు అధికారులు చెప్పిన సమాధానం విని బిత్తరపోయారు. అతని పేరు మీద ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 38 ఖాతాలున్నాయని తెలిసి నోరెళ్లబెట్టాడు. పెద్దేముల్ మండలానికి చెందిన మంగళి అనంతయ్య ఇంటి రుణం కోసం మండల కేంద్రంలోని కెనరా బ్యాంకుకు వెళ్లాడు. అతని ఆధార్, పాన్ కార్డులు పరిశీలించిన బ్యాంకు అధికారులు 38 ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాటు అతని ఖాతా నుంచి లక్షా 24 వేల రూపాయల ద్విచక్ర వాహన రుణం తీసుకున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. తనకు తెలియకుండానే పెద్ద సంఖ్యలో ఖాతాలు ఉండటం సహా రుణం తీసుకోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated : 21 Mar 2023 20:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు