Girl Complaint: అమ్మను కొడుతున్నాడని.. తండ్రిపై ఎనిమిదేళ్ల బాలిక ఫిర్యాదు!

తండ్రిపై ఎనిమిదేళ్ల కుమార్తె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఘటన కర్నూలు (Kurnool) జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది. ‘పోలీస్ సర్.. మా నాన్న లక్ష్మన్న మద్యం తాగి వచ్చి మా అమ్మ జయలక్ష్మిని కొడుతున్నాడు. మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మను కాపాడండి’.. అంటూ సాయికీర్తన అనే బాలిక ఆదోని రెండో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై రవిచంద్రకు సమస్యను వివరించింది. వెంటనే స్పందించిన ఎస్సై.. ఇద్దరు కానిస్టేబుళ్లను బాలికతో పాటు ఆమె ఇంటికి పంపించారు. అప్పటికే తండ్రి లక్ష్మన్న ఇంటి నుంచి వెళ్లిపోయారు. తండ్రి ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఫోన్ చేయాలని చెప్పి కానిస్టేబుళ్లు వెనుదిరిగారు.

Published : 04 Jun 2023 14:29 IST
Tags :

మరిన్ని