Belagavi : రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి సంతకాలు చేసిన ఐసీయూలోని వృద్ధురాలు

కర్ణాటకలోని బెళగావి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్న 80 ఏళ్ల వృద్ధురాల్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆస్తి పంపకాల దస్తావేజులపై సంతకం చేయించడం విమర్శలకు తావిస్తోంది. బెళగావి తాలూకాలోని హిరేబాగేవాడి ప్రాంతానికి చెందిన 80 ఏళ్ల మహాదేవి గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం బాగా క్షీణించడం వల్ల ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 

Published : 02 Oct 2022 14:12 IST

Tags :

మరిన్ని