Andhra News: ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన బాలుడు..సురక్షితంగా బయటకు!

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుగుంటలో బోరుబావిలో పడిన 9ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామానికి చెందిన పూర్ణ జస్వంత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతు గల పూడిపోయిన బోరుబావిలో పడిపోయాడు. అయితే బాలుడు 30 అడుగుల లోతులో రాయిపై చిక్కుకున్నాడు. జస్వంత్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. బోరుబావిలో నుంచి జస్వంత్ కేకలు వేయడంతో స్థానికులు అతనిని గుర్తించారు. వెంటనే హుటాహుటిన తాళ్ల సహాయంతో బోరు బావిలోకి దిగి బాలుడిని ప్రాణాలతో రక్షించి బయటకు తీశారు. 

Published : 07 Jul 2022 12:31 IST

Tags :

మరిన్ని