Sujana: ప్రభుత్వ అసమర్థత వల్లే ఏపీలో అభివృద్ధి లేదు: సుజనాచౌదరి

ఏపీ ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదని కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి (Sujana Chowdary) ఆరోపించారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం తోడ్పాటునిచ్చినా వైకాపా ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో మోదీ 9 ఏళ్ల పాలనపై కరపత్రాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju)తో కలిసి సుజనా చౌదరి ఆవిష్కరించారు. 

Published : 01 Jun 2023 13:21 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు