Baahubali Samosa: పుట్టినరోజు వేడుకల్లో 10 కేజీల బాహుబలి సమోసా కటింగ్

సాధారణంగా పుట్టిన రోజు వేడుకల్లో కేక్ కట్ చేయడం చూస్తుంటాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో మాత్రం ఓ వ్యక్తి తన పుట్టినరోజున ఏకంగా 10 కేజీల బాహుబలి సమోసాను కట్ చేశాడు. అనంతరం దానిని.. మిత్రులు, ఆప్తులకు తినిపించి సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ సమోసాను 4 కేజీల బంగాళదుంపతో పాటు బఠానీలు, పన్నీరు, జీడిపప్పు, ఎండు ద్రాక్షతో తయారు చేసినట్లు వ్యాపారి శుభమ్ కౌశల్ వివరించారు.  దీని తయారీకి 6 గంటల సమయం పట్టినట్లు చెప్పారు. బాహుబలి సమోసాను  గిన్నిస్ బుక్‌లో కూడా నమోదు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు కౌశల్ తెలిపారు. దీనిని తిన్న వారికి రూ.71వేల నగదు బహుమతిని సైతం ఇస్తానని కౌశల్ ఛాలెంజ్ విసురుతున్నారు.

Updated : 21 Nov 2022 15:42 IST

Tags :

మరిన్ని