Ind Vs SL 2023: బౌండరీలో శివమ్‌ మావి అద్భుతమైన క్యాచ్‌..!

రాజ్‌కోట్‌: అది 9.3వ ఓవర్‌.. శ్రీలంక ఇన్నింగ్స్ కాస్త దూకుడుగా సాగుతోంది. క్రీజ్‌లో ఉన్న చరిత్ అసలంక (19) వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే చాహల్‌ వేసిన బంతిని అసలంక ఆఫ్‌సైడ్‌ బౌండరీ లైన్‌ వద్దకు బాదాడు. అంతా సిక్స్‌ అనుకొన్న వేళ.. టీమ్‌ఇండియా యువ బౌలర్‌ శివమ్‌ మావి అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో ప్రేక్షకులు ఆనందంతో పొంగిపోయారు. ఈ సూపర్ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో పోస్టు చేసింది.

Published : 08 Jan 2023 11:12 IST

మరిన్ని