Fire accident: తాడేపల్లిగూడెంలోని ఫుడ్ ఫ్యాట్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఫుడ్ ఫ్యాట్స్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సాల్వెంట్ ప్లాంట్‌లో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ప్లాంట్‌లో ఆరుగురు ఉండగా.. వారిలో ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరొకరి ఆచూకీ లభించడంలేదు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Updated : 21 Dec 2022 19:26 IST

Fire accident: తాడేపల్లిగూడెంలోని ఫుడ్ ఫ్యాట్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం..

Tags :

మరిన్ని