ఆబ్ రోలర్‌పై సాధన చేస్తున్న 72 ఏళ్ల వ్యక్తి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

ఆబ్ రోలర్.. శరీర ఆకృతిని ఓ క్రమ పద్ధతిలో ఉంచుకునేందుకు ఉపయోగించే వ్యాయామ సాధనం. చూడటానికి చిన్నగా ఉన్నా.. దీంతో కసరత్తులు చేయాలంటే మాత్రం అంత సులువు కాదు. పట్టు సాధించేందుకు యువకులైనా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వాడపల్లి వెంకట సత్యనారాయణ.. ఏడు పదుల వయసులో ఆబ్ రోలర్‌పై సాధన చేస్తూ ఇండియా బుక్ ఆఫ్  రికార్డ్స్‌లో చోటు సాధించారు. వ్యాయామానికి  వయసుతో పనేంటంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

Published : 29 Sep 2022 13:03 IST

మరిన్ని

ap-districts
ts-districts