Viral Video: హైదరాబాద్‌లో మళ్లీ.. బాలుడిపై వీధి కుక్క దాడి

హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కలు రెచ్చిపోతూనే ఉన్నాయి. పలు కాలనీల్లో వీటి దాడులకు చిన్నారులు గాయపడుతూనే ఉన్నారు. తాజాగా సూరారం డివిజన్‌ పరిధిలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో బాలుడు సాయి చరిత్‌ (12)పై వీధి కుక్క దాడి చేసింది. తీవ్రగాయాలైన బాలుడిని నల్లకుంటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, వీధి కుక్కల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated : 04 Jun 2023 15:34 IST

Viral Video: హైదరాబాద్‌లో మళ్లీ.. బాలుడిపై వీధి కుక్క దాడి

Tags :

మరిన్ని